ఆంధ్ర ప్రదేశ్

వృద్ధురాలి ప్రేమకు ముగ్ధులైన పవన్

Published by
Srinivas

గత సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ విజయాన్ని కాంక్షిస్తూ వేగులమ్మ అమ్మవారికి మొక్కులు మొక్కి… తన పింఛను సొమ్ముతో మొక్కులు చెల్లించారు పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లికి చెందిన వృద్ధురాలు శ్రీమతి పోతుల పేరంటాలు గారు.

పింఛను సొమ్ము దాచుకొని అమ్మవారికి రూ.27వేల విలువైన గరగ చేయించి ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్, శ్రీమతి పేరంటాలు గారిని మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయానికి పిలిపించుకొని ఆమెతో ముచ్చటించారు. తనపై చూపిన మమకారానికి ముగ్దులయ్యారు.

శ్రీమతి పేరంటాలు గారితో కలసి భోజనం చేశారు డిప్యూటీ సీఎం. ఆత్మీయంగా పలుకరిస్తూ స్వయంగా భోజనం వడ్డించారు. చీరను బహూకరించారు. పింఛను సొమ్ముతో మొక్కులు చెల్లించిన విషయం తెలుసుకుని ఆర్థిక సాయం అందించారు. శ్రీమతి పేరంటాలును క్యాంపు కార్యాలయంలోకి ఆత్మీయంగా ఆహ్వానించిన పవన్ కళ్యాణ్, తిరుగు ప్రయాణానికి ఏర్పాటు చేసి, వాహనం వరకు వచ్చి స్వయంగా సాగనంపారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts