Download App

వారిపైనే పవన్ కళ్యాణ్ గురి – జనసేన ఫ్యూచర్ ప్లాన్ మామూలుగా లేదుగా!

అక్టోబర్ 6, 2025 • By Srinivas
ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన దృష్టిని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై కేంద్రీకరించారు. పార్టీని పునర్‌వ్యవస్థీకరించడమే కాక, ప్రజా స్థాయిలో బలోపేతం చేయాలనే లక్ష్యంతో జిల్లా వారీగా పర్యటన ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. శనివారం మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో జరిగిన జనసేన శాసనసభాపక్ష...
వారిపైనే పవన్ కళ్యాణ్ గురి – జనసేన ఫ్యూచర్ ప్లాన్ మామూలుగా లేదుగా!

ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన దృష్టిని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై కేంద్రీకరించారు. పార్టీని పునర్‌వ్యవస్థీకరించడమే కాక, ప్రజా స్థాయిలో బలోపేతం చేయాలనే లక్ష్యంతో జిల్లా వారీగా పర్యటన ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.

శనివారం మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో జరిగిన జనసేన శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పార్టీ భవిష్యత్ దిశా నిర్దేశం చేశారు. వారం రోజుల పాటు తీవ్ర జ్వరంతో బాధపడిన పవన్ ఇటీవల పూర్తిగా కోలుకుని ఈ సమావేశంలో పాల్గొన్నారు. సుమారు మూడు గంటలపాటు కొనసాగిన ఈ సమావేశంలో, పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలు, స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహంపై విస్తృతంగా చర్చించారు.

ప్రతి ఎమ్మెల్యేకు ఐదు నియోజకవర్గాల బాధ్యత

పార్టీ విస్తరణకు సంబంధించి పవన్ కీలక నిర్ణయం ప్రకటించారు. ప్రతి జనసేన ఎమ్మెల్యేకు కనీసం ఐదు నియోజకవర్గాల బాధ్యతను అప్పగిస్తున్నట్లు తెలిపారు. “ప్రతి ప్రజాప్రతినిధి ప్రజలతో నిరంతరం సమీపంగా ఉండాలి. పార్టీకి సంబంధించిన అన్ని నిర్ణయాలు ప్రణాళికాబద్ధంగా, సమన్వయంతో అమలవ్వాలి” అని పవన్ సూచించారు.

యువతే జనసేన వెన్నెముక

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ యువతతో అనుసంధానం ప్రాధాన్యతను స్పష్టంగా తెలిపారు. “గత ఎన్నికల్లో మిలీనియల్స్ మనకు అండగా నిలిచారు. రాబోయే ఎన్నికల్లో జెన్‌జెడ్ తరాన్ని ఆకట్టుకునేలా పనిచేయాలి,” అని ఆయన వ్యాఖ్యానించారు.

1981–1996 మధ్య జన్మించిన వారిని మిలీనియల్స్ (Generation Y), 1997–2012 మధ్య జన్మించిన వారిని జెన్‌జెడ్ (Generation Z) గా పిలుస్తారని పవన్ వివరించారు. “ఈ తరం ప్రతీ అంశాన్ని గమనిస్తుంది. రుషికొండ ప్యాలెస్ నిర్మాణంలో వృథా అయిన వందల కోట్లు కూడా వీరికి తెలుసు. ఈ అవగాహన కలిగిన యువతే భవిష్యత్తు రాజకీయాలకు వెన్నెముక” అని ఆయన అన్నారు.

మిలీనియల్స్ మద్దతు – జెన్‌జెడ్ ఆకర్షణ

గత ఎన్నికల్లో 30 నుండి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న మిలీనియల్స్ కూటమికి బలమైన మద్దతు ఇచ్చారని పవన్ గుర్తు చేశారు. “మిలీనియల్స్ ఆకాంక్షలను అర్థం చేసుకోవాలి, జెన్‌జెడ్ తరంతో తరచుగా మాట్లాడాలి. వారిని ప్రోత్సహిస్తే, జనసేన భవిష్యత్తు మరింత దృఢంగా ఉంటుంది,” అని పవన్ స్పష్టం చేశారు.

మహిళలు, యువతపై ప్రత్యేక దృష్టి

పవన్ మాట్లాడుతూ, “యువత, మహిళల అభివృద్ధి, సాధికారతకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతి ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలు పర్యవేక్షణ జరగాలి. ఇందుకోసం ప్రతి శాఖ ఆధారంగా ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి, ఆరు వారాల్లో నివేదికలు సమర్పించాలి” అని ఆదేశించారు.

పార్టీ బలోపేతానికి ‘త్రిశూల వ్యూహం’

జనసేనను గ్రామ స్థాయికి చేర్చేందుకు పవన్ ‘త్రిశూల వ్యూహం’ (Trident Strategy) అమలు చేయాలని సూచించారు. ఇందులో భాగంగా ప్రజలతో నేరుగా కలిసే కార్యక్రమాలు, యువత నాయకత్వ ప్రోత్సాహం, స్థానిక సమస్యల పరిష్కారానికి సమగ్ర ప్రణాళికలు రూపొందించనున్నారు.

పవన్ వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. నేపాల్‌లో జెన్‌జెడ్ తరపు ఉద్యమం ప్రభుత్వం మార్పుకు దారి తీసినట్లే, ఆ తరాన్ని ఆకర్షించే ప్రయత్నం ఏపీలో జనసేన కొత్త రాజకీయ వ్యూహానికి పునాది వేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Trending Now

No trending articles in this category from the last 3 days.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading