ఆంధ్ర ప్రదేశ్

సుపరిపాలనకు తొలి అడుగు వేసింది ప్రజా ప్రభుత్వం: నారా లోకేష్

Published by
Srinivas

కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవంతంగా నిర్వహించిన “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉందని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమతుల్యంగా అభివృద్ధి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

“రాయలసీమను ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, రెన్యూవబుల్ ఎనర్జీ, హార్టీకల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం. ఎల్జీ ఎలక్ట్రానిక్స్, రెన్యూ వంటి దిగ్గజ కంపెనీలు వచ్చాయి. ప్రకాశం జిల్లాలో రిలయన్స్ CBG ప్లాంట్లు ఏర్పాటు అవుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో ఆక్వా రంగ అభివృద్ధి జరుగుతోంది. ఉత్తరాంధ్రలో ఐటీ, ఫార్మా, మెడికల్ ఎక్విప్మెంట్ రంగాలతో పాటు ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్, TCS వంటి సంస్థలు వస్తున్నాయి” అని ఆయన వివరించారు.

“డబుల్ ఇంజిన్ సర్కార్ మన బలమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రాష్ట్రం అడిగిన ప్రతీ అభివృద్ధి అభ్యర్థనను నెరవేర్చుతున్నారు” అని పేర్కొన్నారు.

విద్యా శాఖ మంత్రిగా తన శాఖలో తీసుకుంటున్న సంస్కరణల గురించి వివరించిన లోకేష్, విద్యా వ్యవస్థ రాజకీయాలకు అతీతంగా ఉండాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.