Download App

పవన్ కళ్యాణ్ పై పోరాటం వెనుక ఐడెంటిటీ ఆరాటం…

మే 28, 2026 By Suresh Thota
ప్రజాస్వామ్యంలో విమర్శలు, ప్రతివిమర్శలు సర్వసాధారణం. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలను స్వీకరించడం, వాటికి దీటుగా సమాధానం ఇవ్వడం ఒక భాగం. కానీ, ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌ వేదికగా జరుగుతున్న కొన్ని ప్రెస్ మీట్లు చూస్తుంటే విమర్శల స్థాయి ఎంత దిగజారిందో అర్థమవుతుంది....
పవన్ కళ్యాణ్ పై పోరాటం వెనుక ఐడెంటిటీ ఆరాటం…

ప్రజాస్వామ్యంలో విమర్శలు, ప్రతివిమర్శలు సర్వసాధారణం. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలను స్వీకరించడం, వాటికి దీటుగా సమాధానం ఇవ్వడం ఒక భాగం. కానీ, ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌ వేదికగా జరుగుతున్న కొన్ని ప్రెస్ మీట్లు చూస్తుంటే విమర్శల స్థాయి ఎంత దిగజారిందో అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత “పవన్ కళ్యాణ్‌”ను లక్ష్యంగా చేసుకుని ప్రెస్ క్లబ్‌లలో కొందరు జర్నలిస్టులు, విశ్లేషకులు మాట్లాడుతున్న తీరు.. ఆరోగ్యకరమైన రాజకీయ విమర్శలా లేదు సరి కదా, కనీస సంస్కారాన్ని కూడా దాటిపోతోంది. ఈ విమర్శల వెనుక ఉన్న అసలు నైజాన్ని, వారి అంతరంగాన్ని విశ్లేషిస్తే ఒక పచ్చి నిజం బయటపడుతుంది.

సొంత ఉనికి (Identity) కోసం పాకులాట…

అవును మీరు విన్నది నిజమే, నిన్న ​ప్రెస్ క్లబ్‌లో పవన్ కళ్యాణ్‌ పై మైకులు పట్టుకుని విరుచుకుపడుతున్న వారిలో అత్యధికులు సమాజంలోగానీ, రాజకీయాల్లోగానీ ఎలాంటి బలమైన పునాది లేనివారే, నిన్నటివరకు వారి పేర్లు గానీ, వారి ముఖాలు గానీ సామాన్య ప్రజలకు అస్సలు తెలియదు. మీడియాలో ఉన్నవారికి తెలుస్తుంది. అలాంటి వారు రాత్రికి రాత్రే లైమ్‌లైట్‌లోకి రావడానికి, టీవీ ఛానళ్ల స్క్రోలింగ్స్‌లో తమ పేరు పాపులర్ కావడానికి ఎంచుకున్న సులువైన మార్గం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను తిట్టడం.

“ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి” అనే సామెత చందంగా.. ఒక లీడర్ స్థాయిని అందుకోలేనప్పుడు, కనీసం ఆయనను దూషించడం ద్వారా అయినా తమ వైపు నాలుగు కెమెరాలు తిరుగుతాయనేది వీళ్ళ తాపత్రయం లా కనపడుతుంది. ఒకరు చూస్తే పవన్ కళ్యాణ్ కు హైదరాబాద్ పని ఏమిటి అని అడుగుతున్నారు అంటే, వీళ్ళు రాజ్యాంగం తెలిసిన జర్నలిస్టులేనా అని అనిపించకమానదు. పవన్ కళ్యాణ్ అనే పేరు ను పార్లమెంట్ లో ప్రధాని మోదీ తుఫాన్ తో పోల్చారు…. అది ఆయనకు ఉన్న క్రేజ్, ఒక తెలుగువాడిగా గౌరవించలేని సంకుచిత మనస్తత్వం తో వాడు, వీడు, మెడ మీద కాలు వేసి తొక్కుతాం… ఏమిటి ఈ మాటలు… పవన్ కళ్యాణ్ ప్రొఫెసర్ నాగేశ్వర్ విషయంలో మాట్లాడిన తీరు ఎలా ఉంది… జర్నలిస్టులు అయిన మీ తీరు ఎలా ఉంది.. వృద్ధాప్యంలో గౌరవంతో సాధించుకోవాల్సిన పెద్దరికం… నేడు ఉనికి కోసం పోరాడుతున్న మీ మాటలు చూస్తే జాలి వేస్తుంది అంటున్నారు కొందరు నెటిజన్లు… మీ మాటలు ఎలా ఉన్నాయి అంటే… పవన్ కళ్యాణ్ పబ్లిసిటీ వాల్యూను మీరు మీ స్వార్థానికి. ఆయన్ని విమర్శిస్తేనే మీడియా అటెన్షన్ వస్తుందని, తద్వారా తమకు ఒక ఐడెంటిటీ లభిస్తుందని ఆరాటపడుతున్నట్లుగా ఉంది.

​విమర్శల్లో శూన్యత.. వ్యక్తిగత దూషణలే….

ఒక విధానంపై విమర్శలు చేయాలంటే దానికి తగ్గ అధ్యయనం ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి. కానీ ప్రెస్ క్లబ్ వేదికగా మాట్లాడే ఈ ఉనికి కోసం పోరాడుతున్న వ్యక్తుల ప్రసంగాల్లో ఎక్కడా ప్రజా సమస్యలు ఉండవు, ప్రభుత్వ విధానాల పై గొంతెత్తి మాట్లాడే మాటలు ఉండవు. కేవలం “పవన్ కళ్యాణ్” వ్యక్తిగత జీవితం, ఆయన సినిమాలు, ఆయన వేసుకునే బట్టలు లేదా ఆయన మాట్లాడే హావభావాలను విమర్శించే పనిగా పెట్టుకున్నారు. ఆయన ఏది చేసినా చట్టానికి లోబడే చేశారు. రాజ్యాంగాన్ని ఎక్కడా తృణీకరించలేదు. రాజకీయంగా పవన్ కళ్యాణ్‌ను ఎదుర్కొనే సత్తా లేక, కనీసం ఆయన వేగాన్ని అందుకోలేక, ఇలాంటి చీప్ పబ్లిసిటీ స్టంట్స్‌కు తెరలేపుతున్నారు. తమను తాము పెద్ద విశ్లేషకులుగానో, ప్రజా సంఘాల నాయకులుగానో ప్రొజెక్ట్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్‌ను ఒక మెట్టుగా వాడుకోవాలని చూడటం వీరి సంకుచితత్వానికి అద్దం పడుతోంది. తెలంగాణ వచ్చి కూడా పుష్కరం దాటింది… ఒక జనరేషన్ బయటకు వచ్చేసింది. ఇంకా దానినే పట్టుకుని వేలాడటం ప్రజలకు కూడా రుచించదు. మనం భారత దేశంలో అంతర్భాగం అని గుర్తించే జర్నలిస్టుగా మారితే దేశానికి మంచిది.

​తెరవెనుక శక్తుల ప్రోత్సాహం?

​సొంతంగా ప్రెస్ క్లబ్ హాల్ బుక్ చేసుకుని, ప్రెస్ మీట్ పెట్టేంత సీన్ లేని కొందరికి.. తెరవెనుక ఉండి ఎవరో స్క్రిప్ట్ అందిస్తున్నారనే అనుమానాలు కూడా బలపడుతున్నాయి. ఎదో ఒక రాజకీయ ప్రయోజనం ఆశించో, లేదా పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేయాలనే కుట్రతోనో కొందరు వీరిని ముందుంచి నడిపిస్తున్నట్లు స్పష్టమవుతోంది. రాజకీయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకోలేక, కనీసం ఇలాంటి విమర్శల ద్వారానైనా తమ ఉనికిని కాపాడుకోవాలని చూసే ఇలాంటి “ఐడెంటిటీ” కోసం నిరీక్షించే బాధితులను చూసి జనం నవ్వుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వస్తే అడ్డుకుంటాం చీల్చి చెండాడుతాం ఏంటి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలీదు పైగా వీరంతా జర్నలిస్టులు అని చెప్పుకునే ముసుగు వేసుకుంటున్నా వీళ్ళని ఏమనాలో అర్థం కావట్లేదు. ఇది జర్నలిజం నలుగురికి చెప్పాల్సిన వ్యక్తులుగా జర్నలిస్టులుగా ఉండాలి తప్పితే, వాడు ఇక్కడికి రావద్దు వీడు అక్కడికి రావద్దు, వాడెంత వీడు ఎంత అని మాట్లాడే వాళ్లు జర్నలిస్టులు ఎలా అవుతారు…

​ముగింపు: ​ప్రజాస్వామ్యంలో ఎవరినైనా విమర్శించే హక్కు అందరికీ ఉంటుంది. కానీ ఆ విమర్శకు ఒక గౌరవం, అర్హత ఉండాలి. కేవలం మీడియాలో అటెన్షన్ కోసం, సొంత ఐడెంటిటీ కోసం పవన్ కళ్యాణ్ లాంటి ప్రజాదరణ ఉన్న నాయకుడిపై బురదజల్లాలని చూస్తే.. అది విమర్శించే వారి స్థాయిని మరింత దిగజార్చుతుందే తప్ప, ఆయన ఇమేజ్‌ను ఏమాత్రం తగ్గించలేదు. ఇలాంటి పబ్లిసిటీ పిచ్చి మాటలను మీడియా కూడా ప్రోత్సహించకుండా పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. లేదంటే ప్రెస్ క్లబ్‌లు మేధో చర్చల వేదికలుగా కాకుండా, ఉనికి కోసం పాకులాడే వారి అడ్డాలుగా మారిపోయే ప్రమాదం ఉంది.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

Trending Now

No trending articles in this category from the last 3 days.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading