Download App

‘ఎర్రబస్సు రాని ఊరికి ఎయిర్‌బస్సు అవసరమా అన్నారు..’ – నారా లోకేష్

ఆగస్ట్ 1, 2026 • By Rahul N
భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై మాట్లాడుతూ, గత ప్రభుత్వంపై పరోక్ష విమర్శలు గుప్పించారు. "ఉత్తరాంధ్ర ఉత్సాహం అదిరిపోయింది... ఒకప్పుడు 'ఎర్రబస్సు రాని ఊరికి ఎయిర్‌బస్సు అవసరమా' అంటూ ఈ ప్రాంతాన్ని అవమానించిన వారు...
'ఎర్రబస్సు రాని ఊరికి ఎయిర్‌బస్సు అవసరమా అన్నారు..' – నారా లోకేష్

భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై మాట్లాడుతూ, గత ప్రభుత్వంపై పరోక్ష విమర్శలు గుప్పించారు.

“ఉత్తరాంధ్ర ఉత్సాహం అదిరిపోయింది… ఒకప్పుడు ‘ఎర్రబస్సు రాని ఊరికి ఎయిర్‌బస్సు అవసరమా’ అంటూ ఈ ప్రాంతాన్ని అవమానించిన వారు ఉన్నారు. వారికి ఇదే మా సమాధానం. ఎర్రబస్సు కూడా రాదన్న చోటుకే ఈరోజు మన ప్రధాని నరేంద్ర మోదీ గారు వచ్చి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేశారు. అర్థమైందా రాజా!” అంటూ లోకేష్ వ్యాఖ్యానించారు.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక మలుపు అవుతుందని ఆయన అన్నారు.

“ఈ ఎయిర్‌పోర్ట్ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలకు కేంద్రంగా మారబోతోంది. ఉత్తరాంధ్ర యువకులు అవకాశాల కోసం విమానాలు ఎక్కి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇకపై అవకాశాలే విమానాల్లో మిమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడికి రాబోతున్నాయి. ఆ బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటోంది” అని లోకేష్ పేర్కొన్నారు.

లోకేష్ చేసిన ఈ వ్యాఖ్యలు సభలో హాజరైన వారిని ఆకట్టుకోగా, ఆయన ప్రసంగానికి విశేష స్పందన లభించింది.

మరిన్ని వార్తలు

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading