ఆంధ్ర ప్రదేశ్

ఏడాదిన్నర కిందటివరకు ప్రజల ముఖాల్లో చిరునవ్వే కనిపించేది కాదు: చంద్రబాబు

Published by
Rahul N

విజయవాడలో దసరా ఉత్సవాలు సాంస్కృతిక వైభవంతో జరిగాయి. ఇందిరా గాంధీ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు నిర్వహించిన భారీ కార్నివాల్ వాక్, సాంస్కృతిక ప్రదర్శనలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జెండా ఊపి శ్రీకారం చుట్టారు. డప్పు కళాకారుల నృత్యం, కొమ్ము నృత్యం, పులి వేషాలు ప్రజలను అలరించాయి.

“మన సంప్రదాయం… మన కళలు… మన కళాకారులు – ఇదే అసలైన దసరా సంబరాల పరంపర” అని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇకపై దసరా ఉత్సవాలు అంటే కేవలం మైసూరు మాత్రమే కాదు, విజయవాడ కూడా అంతర్జాతీయ గుర్తింపు పొందేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన స్పష్టం చేశారు.

చంద్రబాబు మాట్లాడుతూ, “ఏడాదిన్నర కిందటివరకు రాష్ట్ర ప్రజల ముఖాల్లో చిరునవ్వే కనిపించేది కాదు. ఎక్కడ చూసినా భయం, దాడులు, ఆవేదనే రాజ్యమేలాయి. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రజలకు స్వేచ్ఛ, సంతోషం తిరిగి వచ్చింది. దుర్గమ్మ ఆశీస్సులు, కృష్ణమ్మ కరుణ మనకు తోడుగా ఉన్నాయి” అన్నారు.

అమరావతి నిర్మాణాన్ని తిరిగి గాడిలో పెట్టామని, రాబోయే మూడు సంవత్సరాల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు మళ్లీ ఈ నేలకే తిరిగి వస్తారని సీఎం విశ్వాసం వ్యక్తం చేశారు. ఇకపై దసరా ఉత్సవాలు అంటే విజయవాడ కూడా ప్రపంచ పటంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుందని ఆయన నమ్మకాన్ని వ్యక్తపరిచారు.

విజయవాడ ఉత్సవ్‌లో భాగంగా 280కి పైగా సాంస్కృతిక, వినోదాత్మక కార్యక్రమాలు నిర్వహించగా, లక్షలాది మంది ప్రజలు పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు.

Rahul N

Recent Posts