సినిమా వార్తలు

Kantara Chapter 1: కాంతార చాఫ్టర్ 1 ట్విట్టర్ రివ్యూ

Published by
Rahul N

కాంతార ప్రీక్వెల్ గా వచ్చిన రిషబ్ శెట్టి కాంతార చాఫ్టర్ 1 నేడు థియేటర్లలో రిలీజ్ అయ్యింది. కాంతార పాన్ ఇండియా లెవెల్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.. రిషబ్ శెట్టి తానే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

పీరియడ్ పౌరాణిక యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ ఆధ్వర్యంలో విజయ్ కిరగందూర్ మరియు చలువే గౌడ నిర్మించారు.

ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. 4 రోజుల కిందట హైద్రాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది. ఈ ఈవెంటుకి ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా హైప్ మరింత పెరిగింది.

నేడు థియేటర్లలోకి రాగా, సినిమాని వీక్షించిన ప్రేక్షకులు ట్విట్టర్లో తమ రివ్యూలను పోస్ట్ చేస్తున్నారు.

Rahul N

Recent Posts