మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వల్లభనేనిని నిందితుడిగా పేర్కొంటూ విజయవాడ పోలీసులు కేసు ఫైల్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ దాడి ఘటనకు సంబంధించి 94 మందిపై కేసు నమోదు చేసింది సీఐడీ. ఇందులో ఏ-71గా ఉన్నారు వంశీ. ఇందులో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన కోర్టును ఆశ్రయించగా, కోర్టు ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది.
మరోవైపు ఈ కేసును ఫైల్ చేసిన కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ ను వంశీ కిడ్నాప్ చేశారనేది వల్లభనేని వంశీపై అభియోగం. ఈ మేరకు వంశీపై సత్యవర్ధన్ బంధువులు ఫిర్యాదు చేశారు. దీంతో వంశీని విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ రాయదుర్గంలోని మైహోం భుజాలోని అపార్ట్ మెంట్ లో ఉన్న ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని విజయవాడకు తీసుకెళ్లారు. వంశీపై కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లతో పాటు బీఎన్ఎస్ సెక్షన్లు 140(1), 308, 351(3), రెడ్ విత్ 3(5) కింద కేసులు పెట్టారు. మొత్తం 7 సెక్షన్ల కింద ఆయనపై కేసు పడింది. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఆయన జైళ్లో ఉన్నారు.