Download App

పవన్ కళ్యాణ్ మాటలతో… వైకాపాలో బీటలు…

ఫిబ్రవరి 25, 2026 By Suresh Thota
"కూడారావద్దు అంటే… ఎత్తుకుని తీసుకు వెళ్ళమని ఏడ్చాడట" అలా ఉంది వైకాపా నేతలు పరిస్థితి… నెయ్యి విషయంలో కల్తీ జరిగింది అంటే. రసాయనాలతో కూడిన ఆయిల్స్ మిక్స్ అయ్యాయని గగ్గోలు పెడుతుంటే… అందులో యానిమల్ ఫ్యాట్ కలిసింది అని రిపోర్ట్ ఇవ్వలేదుగా అంటున్నారు. కొంతమంది వైకాపా నేతలు, కార్యకర్తలు...
పవన్ కళ్యాణ్ మాటలతో… వైకాపాలో బీటలు…

“కూడారావద్దు అంటే… ఎత్తుకుని తీసుకు వెళ్ళమని ఏడ్చాడట” అలా ఉంది వైకాపా నేతలు పరిస్థితి… నెయ్యి విషయంలో కల్తీ జరిగింది అంటే. రసాయనాలతో కూడిన ఆయిల్స్ మిక్స్ అయ్యాయని గగ్గోలు పెడుతుంటే… అందులో యానిమల్ ఫ్యాట్ కలిసింది అని రిపోర్ట్ ఇవ్వలేదుగా అంటున్నారు. కొంతమంది వైకాపా నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో.

పవన్ కళ్యాణ్ తితిదే లడ్డూలలో ఉపయోగించిన నెయ్యి విషయంలో సూటిగా మాట్లాడారు.తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) లడ్డు వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన నేపథ్యంలో, అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. లడ్డూ పవిత్రత, నెయ్యి నాణ్యత, టెండర్ల పారదర్శకత అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు సభలో చర్చనీయాంశమయ్యాయి.

తిరుమల లడ్డు కేవలం ఒక ప్రసాదం కాదని, అది కోట్లాది భక్తుల విశ్వాసానికి ప్రతీక అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తిరుమల పేరు తలవగానే ప్రజలు భక్తితో తలవంచుతారు. ఆ పవిత్రతను కాపాడటం మనందరి బాధ్యత అని అన్నారు. టీటీడీపై నిరాధార ఆరోపణలు చేయడం ద్వారా భక్తుల మనోభావాలను దెబ్బతీయవద్దని సూచించారు.

గత ప్రభుత్వ హయాంలో జరిగిన నెయ్యి విషయంలో సూటిగా….. మా హయాంలో తప్పు జరిగినట్లు నిరూపించండి, తప్పు జరిగితే రుజువు చేయండి, మేము కూడా దాన్ని ఖండిస్తాం… దానికి బాధ్యులైన వారిని శిక్షిద్దాం అని చెప్పడం మానేసి… నిందితులను వెనకేసుకురావడం చాలా దారుణం అని అన్నారు.

రాజకీయాలకతీతంగా వ్యవహరించాలి, లడ్డు అంశాన్ని రాజకీయ లాభనష్టాల కోసం ఉపయోగించకూడదని ఆయన స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే ప్రజల్లో గందరగోళం ఏర్పడుతుంది అని వ్యాఖ్యానించారు. ఇది రాజకీయ వేదిక కాదు… ఇది భక్తి, విశ్వాసానికి సంబంధించిన విషయం అని అన్నారు.

రమారమి 68 లక్షల కేజీలు నెయ్యి సరఫరా అయ్యింది. టెండర్లు లో పాల్గొనే సంస్థల కోసం నిబంధనలు మార్చేశారని, కనీసం 4 లక్షల లీటర్ల పాల సేకరణ ఉండాలి అనే నిబంధన కూడా తుంగలోకి తొక్కేసారని అసెంబ్లీ సాక్షి గా ఆవేదన వెళ్లగక్కారు.

సిట్ అధికారులు నెయ్యి లో అసలు నెయ్యి లేదని, రసాయనాల మూలంగా తయారు చేసిన నెయ్యిని , లడ్డూ తయారీలో ఉపయోగించారని, నెయ్యి సరఫరా ప్రక్రియపై వచ్చిన సందేహాలకు సమాధానమిస్తూ, ప్రభుత్వం కఠిన నాణ్యత ప్రమాణాలు పాటిస్తోందని తెలిపారు. ఇప్పుడు టెండర్ విధానం పారదర్శకంగా జరుగుతుందని, అవసరమైతే అన్ని వివరాలు సభ ముందు ఉంచుతామని హామీ ఇచ్చారు.

సభ లో “తిరుమల లడ్డు అంటే విశ్వాసం… ఆ విశ్వాసాన్ని కాపాడటం ప్రభుత్వ ధర్మం” అని పేర్కొన్నారు. టీటీడీ పరిపాలనలో లోపాలుంటే సరిదిద్దుతామని హామీ ఇచ్చారు. స్వామి వారి విషయంలో తప్పు చేస్తే తరాలు నాశనం అయిపోతాయని అన్నారు.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

Trending Now

No trending articles in this category from the last 3 days.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading