రాజకీయ వార్తలు

లండన్‌లో ఇస్కాన్ ఆలయంలో ప్రధాని మోదీ కోసం ప్రత్యేక పూజలు చేసిన నారా లోకేష్

Published by
Srinivas

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ఐటీ, పంచాయతీరాజ్ మంత్రి నారా లోకేష్ లండన్‌లోని ఇస్కాన్ ఆలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మోదీ దీర్ఘాయుష్మంతుడై దేశానికి మరింతకాలం సేవ చేయాలని భగవంతుడిని ప్రార్థించారు.

ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ, “మోదీ గారి మార్గదర్శకత్వంలో వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించగలమనే నమ్మకం ఉంది. దేశాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లే శక్తి ఆయనకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.

ప్రధాని మోదీ నాయకత్వం వల్ల దేశం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని, భారత్ గ్లోబల్ వేదికపై ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందని లోకేష్ పేర్కొన్నారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts