2 దఫాల పాలనలో కేసీఆర్, తెలంగాణను పూర్తిగా అప్పుల్లోకి నెట్టారని విమర్శించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణను 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.
“పదేళ్లు కేసీఆర్ ను చూశారు జనం. 69వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తో రాష్ట్రాన్ని అప్పగిస్తే, 7 లక్షల 11వేల కోట్ల రూపాయల అప్పు చేశారు. అప్పట్లో ఏడాదికి 6500 కోట్లు బకాయిలు కడుతుంటే.. ఇప్పుడు ప్రతి నెల 6500 కోట్లు కేసీఆర్ చేసిన అప్పుకు వడ్డీ కడుతున్నాం.”
ఈ 14 నెలల కాలంలో 75వేల కోట్ల రూపాయలు వడ్డీగా కట్టాల్సి వచ్చిందన్నారు రేవంత్ రెడ్డి. ఈ వడ్డీ రాష్ట్రానికి అతిపెద్ద ముప్పుగా మారిందన్నారు. అలా రాష్ట్రాన్ని దివాళా తీయించిన కేసీఆర్, దాన్ని ప్రజల చేతిలో పెట్టి తను ఫామ్ హౌజ్ లో పడుకున్నారని విమర్శించారు ముఖ్యమంత్రి.
రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు, నిధులు తెచ్చేందుకు కేంద్రంతో తను కొట్లాడుతుంటే, కేసీఆర్ మాత్రం తనను వెనక్కు లాగుతున్నారని, కాలు పట్టుకొని గుంజుతున్నారని అన్నారు రేవంత్ రెడ్డి.