కృష్ణా జలాల వినియోగంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా విమర్శిస్తూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు మూడో పంట సాగు కోసం నీళ్లు వదిలిపెడుతున్నారని ఆరోపించారు.
“కృష్ణా నీటిని ఆంధ్రకు వదిలిపెట్టడమే రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమా? చంద్రబాబుతో మీ చీకటి ఒప్పందం ఏంటి?” అంటూ హరీశ్ రావు ప్రశ్నించారు.
మహబూబ్ నగర్ జిల్లాలో “క్రాప్ హాలిడే” ప్రకటించిన ప్రభుత్వ తీరును తప్పుపడుతూ, అదే సమయంలో ఆంధ్రలో మూడో పంట సాగుకు నీళ్లు వదిలారు. ఈసారి కూడా ఆంధ్రకు నీళ్ళొదిలే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ప్రాజెక్టుల వద్ద పరిస్థితి రోజురోజుకీ ఉద్రిక్తంగా మారుతోంది. మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి ప్రాజెక్టులో మోటర్లు ప్రారంభించకుండా, రైతులను నీటి కోసం వేచి ఉండేలా చేస్తున్న ఈ ప్రభుత్వ తీరు శోచనీయం. రైతుల ఆవేదన తారాస్థాయికి చేరింది. తక్షణమే మోటర్లు ఆన్ చేయకపోతే, వేలాది మంది రైతులతో కలిసి ప్రాజెక్టు వద్దకు వెళ్లి మోటర్లు స్వయంగా ఆన్ చేసే పరిస్థితి వస్తుంది అంటూ హరీష్ రావు హెచ్చరించారు.