తెలంగాణ

మీరు బెల్టు షాపులు తెరిచారు.. మేము రేషన్ కార్డులిస్తున్నాం: సీఎం రేవంత్

Published by
Srinivas

సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలోని భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. లక్షలాదిమంది ప్రజల సమక్షంలో సీఎం చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల 61 వేల 343 కొత్త రేషన్ కార్డులను ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైందని సీఎం ప్రకటించారు.

ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ పాలనపై సీఎం రేవంత్ నిప్పులు చెరిగారు. పదేళ్లు పాలించిన గులాబీ పార్టీ, సన్నబియ్యం–రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వలేదు? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. పదేళ్లలో మీరెవ్వని రేషన్ కార్డులను మీమిస్తున్నాం. మీరు గ్రామాల్లో మీరు రేషన్ షాపులు ఎప్పుడు తెరవలేదు.. బెల్టు షాపులు తెరిచారంటూ అన్నారు. రేషన్ కార్డులు ఇవ్వాలన్నా, సన్న బియ్యం ఇవ్వాలన్నా అది ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యం అని అన్నారు. రైతులకు రుణ మాఫీ చేసి, రైతులను రుణ విముక్తులను చేసిన ఘనత కూడా తమ ప్రభుత్వానికే దక్కుతుందని తెలియజేసారు.

మూడేళ్లలో కాళేశ్వరం కట్టడం, కూలడం రెండూ జరిగిపోయాయ్.. 20 లక్షల కోట్లు ఏం చేశారు అంటూ కాళేశ్వరం ప్రాజెక్టును ఉద్దేశించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.

అంతేకాక, ఇంతకాలం అధికారంలో ఉన్నప్పటికీ గోదావరి నీళ్లు నల్లగొండ జిల్లా వరకు ఎందుకు తేలేదని ప్రశ్నించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని ప్రశ్నించారు. ఇకపై ప్రజలే నిర్ణయం తీసుకుంటారనే ధీమాను వ్యక్తం చేశారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.