Download App

ఈ “అన్నా చెల్లెళ్ళు”కి అనుబంధాలు ఉండవా… ?

జనవరి 7, 2026 By Rahul N
అధికారమే పరమావధి గా సాగుతున్న ఈ కలియుగంలో బంధాలకు, అనుబంధాలకు తావులేదని నిరూపిస్తున్నాయి, అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో మరీను… ఇది జగన్ , షర్మిల కథ. గత ఐదు సంవత్సరాల నుండి తెలుగు రాష్ట్రాల్లో అన్నా, చెల్లెళ్ళ యుద్ధం సాగుతుంది. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి సంతానం జగన్,...
ఈ "అన్నా చెల్లెళ్ళు"కి అనుబంధాలు ఉండవా… ?

అధికారమే పరమావధి గా సాగుతున్న ఈ కలియుగంలో బంధాలకు, అనుబంధాలకు తావులేదని నిరూపిస్తున్నాయి, అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో మరీను…

ఇది జగన్ , షర్మిల కథ.

గత ఐదు సంవత్సరాల నుండి తెలుగు రాష్ట్రాల్లో అన్నా, చెల్లెళ్ళ యుద్ధం సాగుతుంది. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి సంతానం జగన్, షర్మిల… Ys రాజశేఖరరెడ్డి తన ఆస్తి ఇద్దరికీ సమానంగా చెందుతుంది అని చెప్పేవారు అని ఆయన భార్య విజయలక్ష్మి కూడా చెప్పారు… జగన్, షర్మిల మధ్య యుద్ధం, రాజకీయంగా, ఆర్థిక పరంగా సాగుతూ వస్తుంది ….. ఆఖరికి కడప లోకూడా తగిన స్థాయిలో ప్రభావం చూపించలేకపోయాడు Ys జగన్. అన్నా చెల్లెళ్ళ మధ్య ప్రేమ, షర్మిలని రాష్ట్రమంతా పర్యటించేలా చేసింది. జగన్ అన్న వదిలిన బాణాన్ని అని, అన్నగారు జైలు లో ఉంటే నిద్రాహారాలు మాని మరీ తిరిగింది.

వాళ్ళ మధ్య అధికారం పంచుకునే క్రమంలో కాని , ఆస్తులు పంచుకునే క్రమంలో కాని చాలా మనస్పర్థలు వచ్చి తారస్థాయికి చేరుకుని… కనీసం ఒకరినొకరు పలకరించలేని స్థాయికి పోయాయి. దాని ఫలితంగా జగన్ అధికారానికి దూరం అయ్యాడు. ఆయన అధికారానికి దూరం కావడానికి ఇదే కారణం కాదు కాని, ఇది కూడా ఒక కారణం గా భావించవచ్చు. వీళ్లిద్దరి మధ్య సయోధ్య కుదుర్చేవాళ్ళు లేకపోయే…

ఈ "అన్నా చెల్లెళ్ళు"కి అనుబంధాలు ఉండవా… ?

ఇది కేటిఆర్, కవిత ల కథ.

ఇక తెలంగాణ లో కేటీఆర్, కవిత ల మధ్య కూడా అధికారమే లక్ష్యంగా జరుగుతున్నది. కొంతవరకు ఆస్తులు కూడా కారణం గా చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా తనదైన ముద్ర వేయాలని, తెరాస ని బారాస గా మార్చి….. చాలా రాష్ట్రాల్లో తన పార్టీ ఆఫీసులు పెట్టీ…. దేశ రాజధాని ఢిల్లీలో ఏమిటా ఇతని బలం అని జాతీయ రాజకీయ నాయకులు ఆలోచించే స్థాయి లో ఉర్రూతలూగించిన కెసిఆర్…. అచేతన స్థితిలోకి జారిపోయాడు. కారణం కొడుకు, కూతురు మధ్య జరుగుతున్న రగడ….. దేశానికి నిర్దేశకత్వం వహించాలని ఉవ్విళ్ళూరిన కేసీఆర్ అశక్తుడై బేల చూపులు చూస్తున్నాడు తన పిల్లల వైపు.

కవిత లిక్కర్ కుంభకోణం లో చిక్కుకోవడం, తదనంతర పరిణామాలు, కేటీఆర్ పై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి మొదలగు వారు చేసిన ఆరోపణలను ఖండించలేని విధంగా మిన్నకుండిపోవడం తో తెలంగాణ లో అధికారం చేజారిపోయింది. కవిత జైలు నుండి బయటికి వచ్చిన తర్వాత తన కుటుంబ సభ్యులు, సంతోష్ కుమార్, హరిశ్ రావు, కేటీఆర్ మీద ఆరోపణాస్త్రాలు సంధించడం తో BRS దిక్కుతోచని స్థితిలోకి జారిపోయింది. ఇది ఎక్కడివరకు వెళ్ళింది అంటే “కవిత” సొంతంగా పార్టీ పెట్టేటంత స్థాయి కి వెళ్ళింది.

ఈ "అన్నా చెల్లెళ్ళు"కి అనుబంధాలు ఉండవా… ?

వంగవీటి మోహన రంగా, ఆశాకిరణ్

వంగవీటి మోహన రంగా… ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చెరగని ముద్రవేసి చనిపోయిన ముప్పై సంవత్సరాలు అవుతున్న , ప్రజల మధ్య భౌతికంగా లేకపోయిన ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి. ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో అరాచక శక్తుల చేతిలో బలైపోవడంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం బగ్గున మండిపోయింది. తదనంతర కాలంలో టీడీపీ ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది. ఆ దివంగత నేత కు కూడా కొడుకు ,కూతురే….. వంగవీటి రాధాకృష్ణ, ఆశాకిరణ్. రాధా, రంగ మిత్రమండలికి తను సారధ్యం వహిస్తానని వంగవీటి ఆశా కిరణ్ చెబుతున్నారు.

ఈ అన్నా చెల్లెళ్ళు కూడా అధికారం కోసమే పాకులాడుతున్నారు. ఇంతకాలం లేనిది ఇప్పుడు ఆశాకిరణ్ రావడం వెనుక, కొంతమంది కుటుంబ సభ్యులు మరియు ఒక రాజకీయ పార్టీ ప్రమేయం ఉన్నదని రహస్య వర్గాల బోగట్టా…. విభజిత ఆంధ్రప్రదేశ్ లో రాధా, రంగ మిత్రమండలి వెనుక బలమైన సామాజిక వర్గం ఉండటం…. తద్వారా అధికారం అందుకోవాలని వంగవీటి ఆశా కిరణ్ ను తీసుకువచ్చారు అని కొందరు విశ్లేషకుల అభిప్రాయం. కాని రాధాను కాదని, ఎంతమంది ఈమె వెంట నడుస్తారు అనేది ప్రశ్నార్థకమే. కొందరి తమ రాజకీయ స్వలాభం కోసం ఈవిడను పావుగా వాడుకుంటూ తమ ఎదుగుదల కు ఈవిడను ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. అని వంగవీటి రాధా అభిమానులు అంటున్నారు.

ఏది ఏమైనా రెండు రాష్ట్రాల్లో ” అన్నా, చెల్లెళ్ళు” అధికారమనే అందలాన్ని అందుకోవడం కోసం బంధాలు, అనుబంధాలను వదులుకుంటున్నారు. మరింత లోతుగా ఆలోచిస్తే… వీరు పేగు బంధాలను కాదనుకుంటున్నారు… సామాన్య ప్రజల కష్టాలు వీరిని కదిలించగలవా అని నెటిజన్లు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.

“కలసి ఉంటే కలదు సుఖం” అనే పదం వీరి చేత చిన్నతనం లో సరిగ్గా వల్లే వేయించలేదు. అని మరికొందరు నేటి నెటిజన్లు అంటున్నారు.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading