
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన 45 రోజుల ఇంటింటి ప్రచార కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది. ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు నేరుగా వివరించడంతో పాటు, వారి అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకునే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ పిలుపు మేరకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన విజయాలను వివరిస్తున్నారు.

ఈ మహా ప్రజా కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, లక్షలాది మంది కార్యకర్తలు చురుకుగా పాల్గొంటున్నారు. ప్రజలతో నేరుగా మమేకమవుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తున్నారు.
అంతేకాకుండా, ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజల అభిప్రాయాలను సేకరిస్తూ, స్థానికంగా ఉన్న సమస్యలు, అవసరాలు, సూచనలను కూడా తెలుసుకుంటున్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే వేదికగా ఈ కార్యక్రమం ఉపయోగపడుతోంది.

రాష్ట్రవ్యాప్తంగా విస్తృత స్థాయిలో కొనసాగుతున్న ఈ ఇంటింటి ప్రచార కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రతి కుటుంబానికి చేరవేయడంతో పాటు, ప్రభుత్వం–ప్రజల మధ్య మరింత బలమైన అనుబంధాన్ని ఏర్పరచాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు.
