యాక్షన్, ఎమోషన్, ఫ్రెండ్‌షిప్ మిశ్రమంగా భైరవం: నారా రోహిత్
May 27, 2025 Published by Srinivas

నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్ ముఖ్యపాత్రల్లో నటించిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం మే 30న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు టీజర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే భారీగా పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. ఈ సందర్భంగా నారా రోహిత్ మీడియాతో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
భైరవం కథ ఎలా వచ్చిందంటే…
“నిర్మాత బెల్లంకొండ సురేష్ గారు ఈ కథ గురించి ఫోన్ చేసి చెప్పారు. శశికుమార్ చేసిన పాత్ర గురించి వివరించారు. సినిమా చూశాక నచ్చింది. తమిళంలో ఇది రస్టిక్ విలేజ్ డ్రామాగా ఉంటే, తెలుగులో మన నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేశారు.”
మూడు హీరోల కెమిస్ట్రీ
“మా ముగ్గురి మధ్య మంచి పరిచయం ఉంది. వ్యక్తిగతంగా కూడా క్లోజ్ ఫ్రెండ్స్. అందుకే స్క్రీన్ మీద కూడా కెమిస్ట్రీ బాగా కుదిరింది. దర్శకుడు విజయ్ కి ఎప్పటికప్పుడు క్లారిటీ ఉంటుంది. మాకూ ఫ్రీడమ్ ఇచ్చాడు. ప్రతి పాత్రకి ఎమోషనల్ డెప్త్ ఉంది.”
ఫ్యూచర్ ప్రాజెక్ట్స్
“చిన్న బ్రేక్ తీసుకుంటే కాస్త పెద్దదైపోయింది (నవ్వుతూ). ఇకపై రెగ్యులర్ గా సినిమాలు చేస్తాను. సుందరకాండ పూర్తవుతున్న దశలో ఉంది. జూలైలో రిలీజ్ ఉండొచ్చు. ఆ తర్వాత కొత్త సినిమా ఆగస్టులో స్టార్ట్ అవుతుంది.”
మంచు మనోజ్, సాయి శ్రీనివాస్ తో పని చేసిన అనుభవం
“మనోజ్ నాకు చిన్నప్పటినుంచి తెలుసు. ఈ సినిమాతో మంచి పర్సనల్ బాండ్ ఏర్పడింది. సాయి నాకు 2010 నుంచి పరిచయం. డాన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కలిసేవాడిని. ఈ సినిమా మేమంతా ఒక ఫ్యామిలీలా చేసాం.”

జయసుధ పాత్ర
“ఈ సినిమాలో జయసుధ గారు బామ్మగా నటించారు. లెజెండరీ యాక్ట్రెస్ తో పనిచేయడం గర్వంగా అనిపించింది.”
భైరవం ఎలా స్పెషల్ అనిపించింది?
“ఇంతవరకు యాక్షన్ సినిమాలు చేశాను కానీ ఇంత మాస్ కమర్షియల్ సినిమాను మొదటిసారి చేస్తున్నాను. ఇది నాకు న్యూగా అనిపించింది. ఇంటర్వెల్ సీన్ మేము ముగ్గురు కలిసి చేసినది హైలైట్ అవుతుంది. ఆడియన్స్ కి మామూలు అనుభవం ఉండదు.”
తెలుగు నేటివిటీకి మార్పులు
“కథలైన్ ఏమీ మారలేదు కానీ, స్క్రీన్‌ప్లే పూర్తిగా రీరైట్ చేశాం. మన భాషలో, మన ఫీల్‌తో సినిమా ఉంటుంది. ఒరిజినల్ కన్నా బెటర్ అనిపించేట్టుగా ఉంటుంది.”
హీరోయిన్ల పాత్రలు
“ఈ సినిమాలో ప్రతి పాత్రకి విలువ ఉంది. హీరోయిన్ల పాత్రలు కూడా కథలో కీలకంగా ఉండేలా రాసాం. ఇది వెట్రిమారన్ కథ అయినా, తెలుగులో కొత్త అనుభూతిని ఇస్తుంది.”
సంగీతం గురించి
“శ్రీ చరణ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా చేస్తాడన్న పేరు ఉంది. ఈ సినిమాలో పాటలతో కూడా ఆకట్టుకున్నాడు. BGM సినిమా నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది.”

నిర్మాత రాధా మోహన్
“ముగ్గురు హీరోలతో సినిమా తీయడం అంత ఈజీ కాదు. ఎక్కడ రాజీ పడకుండా సినిమాను అద్భుతంగా తీశారు. ఆయనకి ఈ సినిమాతో పెద్ద విజయాన్ని కోరుకుంటున్నాను.”
దర్శకుడు విజయ్ కనకమేడల
“విజయ్ కి ఫుల్ విజన్ ఉంటుంది. సీన్ తీసేటప్పుడే ఎడిటింగ్ పాటర్న్ మైండ్‌లో ఉంటుంది. ఈ సినిమా తను టాప్ కమర్షియల్ డైరెక్టర్ అనిపించుకునేలా ఉంటుంది.”
నిర్మాతగా మీ ప్రయాణం?
“ప్రస్తుతం సుందరకాండ సినిమాను మా కజిన్స్‌తో కలిసి నిర్మిస్తున్నాను. మంచి కథలు వస్తే తప్పకుండా నిర్మాతగా కొనసాగుతాను.”
‘అప్పట్లో ఒకడుండేవాడు’ సీక్వెల్ ఉన్నదా?
“ఆ ఆలోచన ఉంది. కొంత వర్క్ కూడా చేసాం. కానీ పూర్తి కాలేదు. భవిష్యత్తులో అవకాశం ఉంటే చేస్తాం.”
ఇష్టమైన జానర్, సినిమాలు
“హారర్ తప్ప అన్నీ ఇష్టం. (నవ్వుతూ) డబ్బులు ఇచ్చి భయపడాల్సిన అవసరం ఏమిటని అనిపిస్తుంది. నాకు నచ్చిన సినిమాలు సోలో, రౌడీ ఫెలో, బాణం, జో అచ్చుతానంద, అప్పట్లో ఒకడుండేవాడు.”
ఆడియెన్స్‌తో సినిమా చూడాలనే ఉత్సాహం
“భైరవం మే 30న విడుదల అవుతుంది. ఆ రోజు ఆడియన్స్‌తో కలిసి థియేటర్‌లో చూడాలని ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను.”
