
సూపర్ హీరో తేజ సజ్జా నటించిన మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా విజువల్ వండర్ ‘మిరాయ్’ సెప్టెంబర్ 12న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాకింగ్ స్టార్ మనోజ్ మంజు పవర్‌ఫుల్ రోల్ పోషిస్తుండగా, రితికా నాయక్ హీరోయిన్‌గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు.
హనుమాన్ తర్వాత మిరాయ్‌లో ఇంకా కష్టపడ్డాను
తాజాగా విలేకరుల సమావేశంలో తేజ సజ్జా మాట్లాడుతూ – “హనుమాన్‌కి ఎంత ఎఫర్ట్ పెట్టానో, మిరాయ్‌కి ఇంకా ఎక్కువ కష్టపడ్డాను. ప్రతి సినిమాకి ప్రత్యేకత వుంటుంది. హనుమాన్ విజయం వల్ల ఒత్తిడి అనిపించలేదు” అన్నారు.
పాన్-ఇండియన్ లెక్కలు లేవు
మిరాయ్ స్క్రిప్ట్ గురించి మాట్లాడుతూ – “ఈ సినిమాని తెలుగు ప్రేక్షకుల కోసమే తీశాం. పాన్-ఇండియన్ అనే కారణంగా ఎలాంటి మార్పులు చేయలేదు. ఇతర భాషల్లో ఆడితే ఆనందం, కానీ నా ఫోకస్ తెలుగు ఆడియన్స్ మీదే” అని స్పష్టం చేశారు.
క్యారెక్టర్ గురించి
తేజ సజ్జా పాత్రపై మాట్లాడుతూ – “ఒక సాధారణ కుర్రాడు తన ధర్మాన్ని తెలుసుకొని, ఒక పెద్ద ఆపదను ఎదుర్కోవడానికి చేసే ప్రయాణం. తన తల్లి ఆశయాన్ని నెరవేర్చే కుర్రాడి కథ ఇది” అన్నారు.
యాక్షన్ సీక్వెన్స్‌లు
“మిరాయ్‌లో తొమ్మిది యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయి. ప్రతి ఫైట్ సీన్ దాని సొంత చాలెంజ్. రిలీజ్ రోజున ఆడియన్స్ థ్రిల్ అవుతారని మాత్రమే అనిపించింది” అని చెప్పారు.

సీనియర్ నటులతో వర్క్ ఎక్స్పీరియన్స్
శ్రియ, జగపతిబాబు, జయరామ్‌లతో కలిసి నటించిన అనుభవంపై – “చిన్నప్పుడు వారితో నటించాను. ఇప్పుడు మళ్ళీ కలిసి పని చేయడం ఆనందం. మైనస్ 80 డిగ్రీలలో కూడా షూట్ చేశారు. మా సినిమా కోసం పడిన కష్టానికి వారికి ధన్యవాదాలు” అని అన్నారు.
మనోజ్ మంజు పాత్రపై
“మనోజ్ గారు ఒక పవర్‌ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఫిలాసఫీ ఉన్న, డేంజర్ క్రియేట్ చేసే రోల్. ఆ పాత్రకి ఆయన చాలా ఎక్సైటయ్యారు” అన్నారు.
మ్యూజిక్ & ప్రొడ్యూసర్ సపోర్ట్
“హరి గౌర గారు ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చారు. నిర్మాత విశ్వప్రసాద్ గారు మాకు ఫ్రీడం, గౌరవం ఇచ్చారు. అలాంటి పాషన్ ప్రొడ్యూసర్‌తో వర్క్ చేయడం అదృష్టం” అని తెలిపారు.
ట్రైలర్‌కి వచ్చిన కాంప్లిమెంట్స్
“చిరంజీవి గారు, నాని అన్న మెసేజ్ పెట్టారు. కరణ్ జోహార్ గారు కూడా మా సినిమాపై ప్రత్యేకంగా కాంప్లిమెంట్స్ ఇచ్చి సపోర్ట్ చేస్తానన్నారు” అని తేజ సజ్జా వెల్లడించారు.
మిరాయ్ 2 పై
“సినిమా హిట్ అయితే ఖచ్చితంగా మిరాయ్ ఫ్రాంచైజ్ అవుతుంది. ప్రేక్షకులు ఆదరిస్తే పార్ట్ 2 వస్తుంది” అని అన్నారు.
ఆడియన్స్‌కు మెసేజ్
“మిరాయ్ వెరీ క్లీన్ ఫ్యామిలీ ఫిలిం. యాక్షన్, అడ్వెంచర్, ఫాంటసీ, ఎమోషన్, డివోషన్ అన్నీ ఉంటాయి. పిల్లలకు ప్రత్యేకంగా నచ్చే సినిమా అవుతుంది. థియేటర్స్‌లో ఇంటర్నేషనల్ స్థాయి అనుభవం ఇస్తుంది” అని తేజ సజ్జా తెలిపారు.
