Download App

మెగాస్టార్ 47 ఏళ్ల సినీప్రస్థానం – పండుగ మూడ్‌లో ఫ్యాన్స్

సెప్టెంబర్ 22, 2025 By Srinivas
1978 సెప్టెంబర్ 22… తెలుగు సినిమా చరిత్రలో ఒక ప్రత్యేకమైన రోజు. ఆ రోజు ‘ప్రణం ఖరీదు’ సినిమాతో తెరపైకి వచ్చిన ఓ యువకుడు… తరువాత మెగాస్టార్ చిరంజీవిగా కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. అప్పటి నుంచి ఈ రోజు వరకు 47 ఏళ్ల మెరిసే...
మెగాస్టార్ 47 ఏళ్ల సినీప్రస్థానం – పండుగ మూడ్‌లో ఫ్యాన్స్

1978 సెప్టెంబర్ 22… తెలుగు సినిమా చరిత్రలో ఒక ప్రత్యేకమైన రోజు. ఆ రోజు ‘ప్రణం ఖరీదు’ సినిమాతో తెరపైకి వచ్చిన ఓ యువకుడు… తరువాత మెగాస్టార్ చిరంజీవిగా కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. అప్పటి నుంచి ఈ రోజు వరకు 47 ఏళ్ల మెరిసే సినీప్రస్థానం.

ప్రాణం ఖరీదులో చిరంజీవి చిన్న పాత్రలో కనిపించినప్పటికీ, ఆయన చూపిన నటనా తీరు, తెరపై తళుక్కుమన్న ఆ తేజం చూసి అప్పటి నుంచే ఇండస్ట్రీలో కొత్త తార పుట్టిందని అందరూ గమనించారు. సామాజిక సమస్యల్ని బలంగా చూపిన ఆ సినిమా తెలుగు ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోయింది.

ఇప్పుడు 47 ఏళ్లు పూర్తయిన ఈ సందర్భంలో అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటూ, “ఇండస్ట్రీకి చిరంజీవి వచ్చిన రోజు మా పండుగ రోజు” అని కామెంట్లు చేస్తున్నారు. ఎక్కడ చూసినా #47YearsOfChiranjeeviinCinema హాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

ఈ సందర్భంగా చిరంజీవి కూడా అభిమానులతో తన భావాలను పంచుకున్నారు:

“ప్రాణం ఖరీదు” చిత్రం ద్వారా ‘చిరంజీవిగా’ మీకు పరిచయం అయ్యి నేటితో 47 ఏళ్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి. ఈ చిత్రం ద్వారా నాకు నటుడిగా ప్రాణం పోసి.., మీ అన్నయ్యగా, కొడుకుగా, మీ కుటుంబ సభ్యుడిగా , ఒక మెగాస్టార్ గా.. అనుక్షణం నన్ను ఆదరించి, అభిమానించిన తెలుగు సినిమా ప్రేక్షకులకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను. ” అని అన్నారు.

అభిమానులు అయితే ఇంకా పెద్ద ఎత్తున సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, “చిరంజీవి అంటే మాకే కాదు, తెలుగు సినీ పరిశ్రమకే గర్వకారణం. ప్రాణం ఖరీదు మా మెగాస్టార్ పుట్టినరోజు లాంటిదే” అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading