అలనాటి తెలుగు హాస్య నటుడు అల్లు రామలింగయ్య సతీమణి, ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కు తల్లి అయిన కనకరత్నం శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 94 సంవత్సరాలు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఇక లేరన్న వార్త అల్లు కుటుంబానికి, సినీ వర్గాలకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
అల్లు కుటుంబ పెద్ద అయిన అల్లు కనకరత్నం మృతి వార్త తెలిసిన వెంటనే టాలీవుడ్‌లోని పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిర్మాత అల్లు అరవింద్ తల్లి కావడంతో, పలువురు ప్రముఖులు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె భౌతిక కాయం కోకాపేట నివాసాయానికి ఉదయం 9 గంటలకు చేరుకోనుంది. ఈ ఏర్పాట్లను ఆమె అల్లుడు, మెగాస్టార్ చిరంజీవి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
అంత్యక్రియలు ఈ మధ్యాహ్నం కోకాపేటలో జరగనున్నాయి. మనవళ్లు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుసగా ముంబై, మైసూరు నుండి హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. ఇదే సమయంలో జనసేనాని పవన్ కల్యాణ్, నటుడు నాగబాబు వైజాగ్‌లో జరుగుతున్న ప్రజా సమావేశాల కారణంగా రేపటికి కోకాపేటకు చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.
అటు అల్లు, ఇటు మెగా కుటుంబానికి దార్శనికురాలిగా నిలిచిన అల్లు కనకరత్నం మరణం సినీ, రాజకీయ వర్గాల్లో శోకసంద్రం నింపింది.