సినిమా వార్తలు

USAలో దూసుకుపోతున్న ‘OG’.. ఇక ఆ రికార్డులన్నీ మడతపెట్టి…

Published by
Rahul N

రోజురోజుకీ పవన్ కళ్యాణ్ They Call Him OG హైప్ మరింత పెరుగుతోంది. ఇక USA ప్రీ సేల్స్ లో ఆ సినిమాల రికార్డులన్నీ మడతెట్టేస్తోంది.

పవర్‌స్టార్ సినిమా OGకి వచ్చిన హైప్‌కు హద్దుల్లేవు. ఎంతోకాలం తర్వాత పవన్ అసలైన మాస్ హంగామా చూపించే సినిమా వస్తోందన్న అంచనాలతో అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మాస్ క్రేజ్ మళ్లీ చాటుకుంటోంది. సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ‘ఓజీ’ సినిమాకు అమెరికా ప్రీమియర్ ప్రీ-సేల్స్ దూకుడుగా సాగుతున్నాయి. రెండు రోజులకే ఈ సినిమా అర మిలియన్ డాలర్లు దాటేసి సంచలనం సృష్టించింది.

ఇంతకుముందు భారీ అంచనాలతో వచ్చిన ‘కల్కి 2898 AD’, ‘దేవర’, ‘పుష్ప 2’ వంటి చిత్రాలను కూడా ఈ ప్రీ-సేల్స్ దాటేయడం విశేషం. అమెరికాలోనే ఇంత రేంజ్ రికార్డు సాధిస్తుంటే, తెలుగురాష్ట్రాల్లో రిలీజ్ సమయంలో ఏ స్థాయిలో బాక్సాఫీస్ తుఫాన్ సృష్టించబోతోందో చెప్పనవసరం లేదు.

దాదాపు దశాబ్దం తరువాత పవన్ కల్యాణ్ నిజమైన స్టామినాకు తగ్గ సినిమా రాబోతుందనే నమ్మకంతో అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. దీంతో ‘ఓజీ’ పవన్ కెరీర్‌లోనే అతిపెద్ద ఓపెనర్ అవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ ప్రతినాయకుడిగా కనిపించనుండగా, ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే థమన్ సంగీతంలో విడుదలైన రెండు పాటలు భారీగా హిట్ అయ్యాయి. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఫైర్ స్టార్మ్ మరియు సువ్వి సువ్వి తో పవన్ ఫాన్స్ ని వోగ్ మరిన్ని సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే. ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Rahul N

Recent Posts

  • సినిమా వార్తలు

హీరోయిన్లతో రూమర్స్… భయపడిన నాగవంశీ?

నవంబర్ 17, 2026