Download App

‘AA23’తో మరోసారి నిరూపించిన అల్లు అర్జున్

ఆగస్ట్ 2, 2026 By Srinivas
సినీ పరిశ్రమలో స్టార్‌డమ్ పెరిగిన కొద్దీ చాలా మంది తమ కెరీర్‌పైనే దృష్టి పెడతారు. కానీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం తనతో పాటు తన ప్రయాణంలో ఉన్నవాళ్లు కూడా ఎదగాలని ఎప్పుడూ కోరుకుంటారు. అందుకే ఆయనను కేవలం స్టార్ హీరోగానే కాకుండా, తనవాళ్లను ముందుకు తీసుకెళ్లే...
'AA23'తో మరోసారి నిరూపించిన అల్లు అర్జున్

సినీ పరిశ్రమలో స్టార్‌డమ్ పెరిగిన కొద్దీ చాలా మంది తమ కెరీర్‌పైనే దృష్టి పెడతారు. కానీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం తనతో పాటు తన ప్రయాణంలో ఉన్నవాళ్లు కూడా ఎదగాలని ఎప్పుడూ కోరుకుంటారు. అందుకే ఆయనను కేవలం స్టార్ హీరోగానే కాకుండా, తనవాళ్లను ముందుకు తీసుకెళ్లే వ్యక్తిగా కూడా పరిశ్రమ గుర్తిస్తుంది.

అందుకు తాజా ఉదాహరణ ‘AA23’. ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా అల్లు అర్జున్ తన అత్యంత సన్నిహితులైన బన్నీ వాస్, సందీప్ రామినేని, నటరాజ్, స్వాతిలను ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి కో-ప్రొడ్యూసర్లుగా తీసుకోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

అల్లు అర్జున్ ప్రయాణాన్ని గమనిస్తే ఇది కొత్త విషయం కాదు. ఆయనతో కలిసి ఎన్నో ఏళ్లుగా ప్రయాణించిన పలువురు నేడు నిర్మాతలుగా, వ్యాపారవేత్తలుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎస్‌కేఎన్, శరత్ చంద్ర నాయుడు, వంశీ నందిపాటి, ధీరజ్ మొగిలినేని, ఏలూరు శ్రీను వంటి వారు తమ తమ రంగాల్లో విజయవంతంగా నిలవడంలో బన్నీ ప్రోత్సాహం కూడా ఒక కారణంగా సినీ వర్గాలు చెబుతుంటాయి.

తన చుట్టూ ఉన్నవారికి అవకాశాలు ఇవ్వడం, బాధ్యతలు అప్పగించడం, వారిని నిర్ణయాల్లో భాగస్వాములను చేయడం అల్లు అర్జున్ ప్రత్యేకతగా చెప్పుకుంటారు. అదే తత్వాన్ని ఇప్పుడు ‘AA23’తో మరోసారి ఆచరణలో చూపించారు.

ఈ నిర్ణయం సోషల్ మీడియాలోనూ ప్రశంసలు అందుకుంటోంది. “ఒక్కడే ఎదగడం కాదు… తనతో పాటు తనవాళ్లను కూడా ఎదిగించడం నిజమైన విజయం” అంటూ అభిమానులు అల్లు అర్జున్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే, అల్లు అర్జున్ ప్రస్తుతం దర్శకుడు అట్లీతో తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘రాకా’తో బిజీగా ఉన్నారు. ఇటీవల విడుదలైన ఆయన ఫస్ట్ లుక్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మరోవైపు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘పుష్ప 3: ది ర్యాంపేజ్’తో పాటు మరికొన్ని భారీ ప్రాజెక్టులు కూడా ఆయన లైనప్‌లో ఉన్నాయి.

పాన్ ఇండియా స్టార్‌గా రికార్డులు సృష్టిస్తూనే, తనతో నడిచిన వారిని కూడా విజయ భాగస్వాములుగా మార్చుకుంటూ అల్లు అర్జున్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading