Download App

బోనాలపై ట్రోలింగ్.. కన్నీటితో ఫరియా అబ్దుల్లా ఎమోషనల్ వీడియో

ఆగస్ట్ 15, 2026 • By Srinivas
తెలంగాణ సంస్కృతిలో ఎంతో ప్రత్యేకమైన బోనాల పండుగలో పాల్గొన్న నటి ఫరియా అబ్దుల్లాకు సోషల్ మీడియాలో ఊహించని విమర్శలు ఎదురయ్యాయి. ఆమె మతాన్ని ప్రస్తావిస్తూ కొందరు నెటిజన్లు చేసిన కామెంట్లపై ఫరియా తాజాగా స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో తన భావాలను పంచుకుంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు....
బోనాలపై ట్రోలింగ్.. కన్నీటితో ఫరియా అబ్దుల్లా ఎమోషనల్ వీడియో

తెలంగాణ సంస్కృతిలో ఎంతో ప్రత్యేకమైన బోనాల పండుగలో పాల్గొన్న నటి ఫరియా అబ్దుల్లాకు సోషల్ మీడియాలో ఊహించని విమర్శలు ఎదురయ్యాయి. ఆమె మతాన్ని ప్రస్తావిస్తూ కొందరు నెటిజన్లు చేసిన కామెంట్లపై ఫరియా తాజాగా స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో తన భావాలను పంచుకుంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు.

తన తండ్రి ఇస్లాం మతాన్ని ఇష్టపడి స్వీకరించారని ఫరియా తెలిపారు. ఒక మతంలోని మంచిని చూసి స్వీకరించిన వ్యక్తి తనను పెంచారని, అందుకే చిన్నప్పటి నుంచే అన్ని విషయాల్లోని మంచిని చూడటం నేర్చుకున్నానని చెప్పారు.

‘‘నన్ను కాఫిర్ అని, తప్పు చేస్తున్నావని తిడుతున్న వారికి కూడా నేను మంచి జరగాలని కోరుకుంటాను. ఎందుకంటే ద్వేషానికి నేను ద్వేషంతో సమాధానం చెప్పాలనుకోవడం లేదు’’ అని ఫరియా పేర్కొన్నారు.

Faria Abdullah at Telangana Bonalu

ప్రకృతిపై తనకున్న నమ్మకం, ఆధ్యాత్మిక ఆలోచనలను కూడా ఆమె ఈ సందర్భంగా వివరించారు. చెట్లు, రాళ్లు, సీతాకోకచిలుకలు.. ఇలా ప్రకృతిలోని ప్రతి అణువులోనూ తనకు ప్రాణం, దైవత్వం కనిపిస్తాయని చెప్పారు.

చిన్నతనంలో ‘అల్లాహ్ అంటే ఏమిటి?’ అని తల్లిని అడిగిన సందర్భాన్ని ఫరియా గుర్తుచేసుకున్నారు. ‘‘అల్లాహ్ అంటే వెలుగు.. అంతటా, ఎల్లప్పుడూ నిండి ఉండే ఒక దివ్యశక్తి’’ అని తన తల్లి చెప్పారని తెలిపారు. అలాంటి దైవశక్తి అంతటా ఉందని నమ్ముతున్నప్పుడు.. దాన్ని మతాల పేరుతో ఎలా వేరు చేయగలమని ఆమె ప్రశ్నించారు.

తాను ఎప్పుడూ ప్రేమ, శాంతి, ఐక్యత కోసం మాత్రమే ప్రార్థిస్తానని ఫరియా స్పష్టం చేశారు. తనను ద్వేషించే వారికి కూడా ప్రేమనే పంపుతానని చెప్పారు.

ఫరియా షేర్ చేసిన ఈ ఎమోషనల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె మాటలకు పలువురు నెటిజన్లు మద్దతు తెలుపుతూ.. భిన్నమైన సంస్కృతులు, సంప్రదాయాలను గౌరవించడం తప్పు కాదని కామెంట్లు చేస్తున్నారు. బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నందుకు వచ్చిన ట్రోలింగ్‌కు ఫరియా ఇచ్చిన సమాధానం ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading