Download App

ప్రభాస్ తో “రాజా సాబ్” ఎలా…? లంబోర్ఘిని కారులో ‘మారుతి’ ఇంజిన్…

జనవరి 13, 2026 Published by Suresh Thota

ప్రభాస్ తో "రాజా సాబ్" ఎలా…? లంబోర్ఘిని కారులో 'మారుతి' ఇంజిన్…

తెలుగు రాష్ట్రాల్లో సినిమా అభిమానులు బాగా ఎక్కువ, క్రికెట్ ఫీవర్ ఎలా ఉంటుందో దేశం లో… అలాగే తెలుగు రాష్ట్రాల్లో సినిమా విడుదల అవుతుంది అంటే అంతే ఫీవర్ ఉంటుంది. ఆ స్థాయిలో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది కూడా… ఈ సినిమా గ్లామర్ తోనే చాలా మంది నటులు, MLA, MP లుగా ఎన్నికైనారు. ఎన్టీఆర్ ను భగవంతుని గా బావించే స్థాయి లో అభిమానించి పార్టీ పెట్టిన 9 నెలల కాలంలో ముఖ్యమంత్రి గా కూడా ఎన్నుకున్నారు. సినిమా అంత ప్రభావం చూపించింది. అప్పుడు సినిమా ను వ్యాపార పరంగా చూసినా , కళామతల్లిగా భావించి అందరూ గౌరవించుకుంటూ సినిమా అభివృద్ధికి పరితపించేవారు.

కాని ఇప్పుడు సినిమా ఎలా ఉంది అంటే కాంబినేషన్… కథతో సంబంధం లేకుండా ఎంత వ్యాపారం చేశాము. పబ్లిసిటీ తో సినిమా బిజినెస్ చేసుకుందాం అనే కోణం తప్ప, ఇండస్ట్రీ నాలుగు కాలాలు బాగుండాలి అనే ధ్యాస లేకుండా పోతుంది.

ఇది “రాజా సాబ్” సినిమా మీద విశ్లేషణ తప్పితే మరొకటి కాదు, ఇదే ఇండస్ట్రీ లో ఉంటూ సినిమాను చంపే మనస్తత్వం కాదు….. మా “ఇండియా గ్లిట్జ్” సినిమా సమీక్ష…. అందుకే విడుదల తరువాత ఇప్పుడు స్పందన. సినీ పరిశ్రమ బాగుండాలి… అందులో మేము ఉండాలి అని కోరుకుంటాం. ఇక సినిమా విషయానికి వద్దాం.

హీరో విషయానికి వస్తే….. హీరో ప్రభాస్ కి కథ చెప్పినప్పుడు ఆయన ఏమి విన్నాడు. ఈ కథ నాకు ఎంతవరకు సరిపోతుంది అనేది ఆలోచించుకోవాలి. మీ మీద ఎంత వ్యాపారం జరుగుతుంది. ఏఏ కథలు ఎన్నుకోవాలి… పాన్ ఇండియా హీరో అయ్యి ఉండి… ఇటువంటి కథనా…. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ ఈ టైపు కథలు చేసేసారు. ఇది మీరు చేసే కథ కాదు… అక్కడ వాళ్ళు చేసేసిన తర్వాత మీరు ఆ తరహా కథలు ఎన్నుకుంటే ఎట్లా…. రాజమౌళి మీతో ఛత్రపతి తీసిన తరువాత మగధీర తీస్తున్నప్పుడే…. బాహుబలి లాంటి కథకు మీరు హీరో అని మనసులో మెదిలి ఉంటారు. అప్పటినుండి వర్క్ చేస్తే బాహుబలి వచ్చింది. దాని తో మీరు పాన్ ఇండియా స్టార్ అయ్యారు. అవన్నీ ఆలోచించకుండా మీరు “రాజా సాబ్” వంటి సినిమాలు చేస్తే ఎలా…

ప్రతిసారి మీ సినిమా వేడుకలలో ప్రభాస్ ఫుడ్ పెట్టీ చంపేస్తాడు… ఇదే వరుస… ఇవే మాటలు… మీ సినిమా ఫంక్షన్ అంటే ఎలా ఉండాలి… ఏ స్థాయి వ్యక్తులు పంచుకోవాలి వేదికను అన్న దానిపై దృష్టి లేకపోతే ఎట్లా… తెలుగు ఇండస్ట్రీ వాళ్ళను పక్కన పెడదాం… ఒక అమితాబ్ బచ్చన్, రజనీ కాంత్, మోహన్ లాల్, మమ్ముట్టి, లేదా సీఎం స్థాయి, లేదా సెంట్రల్ మినిస్టర్, గవర్నర్ లాంటి వ్యక్తులు వ్యాఖ్యానిస్తే మీ సభకు శోభ నిస్తాయి…. ఎందుకంటే మీరు పాన్ ఇండియా హీరో… మీ చుట్టూ భజన పరులు ఎక్కువైపోయారు అని ఇండస్ట్రీ టాక్…. ” జుట్టు అంటూ ఉంటే, ఎన్ని కొప్పులైనా పెట్టొచ్చు” మీరు హీరో గా మంచి కథలు అంటే…. మీ పర్సనాలిటీ సరిపోయే కథలు చేస్తే …. ధర్మ రాజు రాజసూయ యాగం చేసినప్పుడు ప్రతి లక్షమంది కి ఒక గంట కొట్టమన్నాడట…. అలాగా మీరు కూడా బోజనాలు పెట్టీ గంటలు కొట్టించుకోండి. కాని మీ తరహా కథలు ఎన్నుకోండి…. ఇండస్ట్రీ కూడా బాగుంటుంది.

ఇక నిర్మాత… మీరు సినిమా చేస్తున్నప్పుడు ఎవరితో చేస్తున్నారో మీకు అర్థం అయ్యిందా… లేకపోతే చిన్న సినిమా గా చేద్దామని అనుకున్నారా…? విశ్వప్రసాద్ గారు… రూపాయి వస్తువు రూపాయి పావలా కు అమ్మడం వ్యాపారం. రూపాయిన్నర కు అమ్మడం తెలివితేటలు… రెండు రూపాయలకు అమ్మడం మోసం… ఇది మీకు తెలియనిది కాదు… పెద్ద హీరో దొరికాడు… క్యాష్ చేసుకుందాం అని అనుకున్నారా…. మీ మనసులో లెక్కలే ఉండి ఉంటాయి… ఇవి తేలాలంటే మీకు కాస్త టైమ్ పడుతుంది.

ఇక దర్శకుడు… మారుతి…. అంది వచ్చిన అవకాశాన్ని ఇలా నా… గతంలో మీ సినిమాలకు ఈ సినిమాకు సంబంధం ఉందా… అదే కోణంలో ఆలోచించారా… ఏదో కొంతమంది దర్శకులు ఫస్ట్ కాపీ ఇంతలో చేసి ఇచ్చేస్తామని అంటారు… మీరు కూడా అలా ఆలోచించారా… ప్రభాస్ లాంటి హీరో దొరికినప్పుడు, మీరు ఎటువంటి కథను ఎంచుకోవాలి. మీరు బయట సమాజంలో ప్రతి ఒక్కరి ని, వాళ్ళ అభిప్రాయాలని సేకరిస్తూ ఉంటారు గా… “లంబోర్ఘిని కారులో మారుతి ఇంజిన్” వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది అని సినీ ప్రేమికులు అంటున్నారు.

కొంతమంది ప్రభాస్ అభిమానులు కన్నీరు పెట్టారు… మీరు కథను ఆయన్ని ఇంప్రెస్ చేస్తూ ఆయనకి ఇష్టమైనట్టు తీసాను అని చెప్పారు… అక్కడే మీ ఓటమి నీ ఒప్పుకున్నట్టుంది. పైగా పది రోజులు ఆగితే సినిమా బాగుంటుంది అన్నారు… మీరు తీసిన సినిమా కె.విశ్వనాథ గారి “శంకరాభరణం” లాంటిది అనుకుంటున్నారా… అప్పటి రోజులు వేరు… తేడా వస్తే OTT లో కూడా చూడటం లేదు మారుతి గారు. మీరు చెప్పింది ఎలా ఉంది అంటే నేను తీసింది. అర్ధం చేసుకోలేకపోయారు అనే కోణంలో ఉంది. వేదిక మీద ఇంటి అడ్రస్ ఇచ్చినప్పుడే అర్ధం చేసుకోవాలి. అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. సినిమా వీక్ గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్ లో ఉంటుంది అని… మరికొందరు…. ఏది ఏమైనా ఒక్క విషయంలో మీరు అద్భుతమైన సక్సెస్ సాధించారు. ఈ కథ చెప్పి హీరోను ఒప్పించడంలో…

ఇవి బయట జనం దగ్గరనుండి సేకరించిన అభిప్రాయాలతో…

కొసమెరుపు: హీరో గారు…. “Come to my room” అనడం కాదు… మీరు గది నుండి బయటకు వచ్చి కథలు వినండి.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading