ఇది వారికి తగిలి తీరుతుంది… ట్రోలర్స్ కి గట్టిగా ఇచ్చి పడేసిన దర్శకుడు మారుతి
జనవరి 13, 2026 Published by Srinivas

దర్శకుడు Maruthi తన తాజా సినిమా కాన్సెప్ట్, దానిపై వస్తున్న విమర్శలు, ట్రోల్స్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీడియాతో జరిగిన ఇంటరాక్షన్‌లో సినిమా లోతు అర్థం కావాలంటే ఒక్కసారి కాదు, మళ్లీ చూడాల్సిందేనని ఆయన అన్నారు.
“బ్రెయిన్‌తో దెయ్యాన్ని ఓడించడం అనే కొత్త పాయింట్‌తో సినిమా తీసాం. ఒకే మెసేజ్‌లో రెండు విషయాలు చెప్పాలనుకున్నాం. కానీ బయటకు వచ్చినప్పుడు అది అందరికీ పూర్తిగా అర్థం కాలేదేమో,” అని మారుతి వివరించారు.
సినిమాను మొదటిసారి చూసేటప్పుడు ప్రేక్షకులు ఉపరితల అంశాలను మాత్రమే గమనిస్తారని, రెండోసారి చూస్తే కథలోని లోతు, ఆలోచన స్పష్టంగా అర్థమవుతుందని చెప్పారు. “మీకు పూర్తిగా అర్థం కావాలంటే సినిమా మళ్లీ చూడండి,” అని ఆయన సూచించారు.
మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, Sanjay Dutt పాత్రలో బ్రెయిన్ గేమ్ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉందని, కానీ అది పూర్తిగా చూపించలేదనే అనుమానం వ్యక్తం చేశారు. దీనికి మారుతి సమాధానంగా, “మీరు సరిగ్గా చూడలేదనేదే నా అనుమానం,” అంటూ ధైర్యంగా స్పందించారు.
ట్రోల్స్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన మారుతి, “మూడు సంవత్సరాల కష్టాన్ని మూడు గంటల సినిమాలో చూపిస్తుంటే ఇష్టం వచ్చినట్టు ట్రోల్స్ చేస్తున్నారు. ఇవన్నీ నేచర్ చూసుకుంటుంది,” అన్నారు. భవిష్యత్తులో ట్రోల్ చేసినవాళ్లకే తాము ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నామో అర్థమవుతుందని, దీని ప్రభావం తప్పకుండా వాళ్లపై చూపుతుందని అన్నారు.
మొత్తానికి, తన సినిమా మీద నమ్మకంతో పాటు, సినిమా కోసం చేసిన కష్టంపై మారుతి మాటలు ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.
