Download App

Andhra King Taluka: ‘చిన్ని గుండెలో’… ప్రేమలో తేలిపోయే మాజికల్ మెలోడీ!

అక్టోబర్ 31, 2025 • By Rahul N
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ నుంచి తాజాగా విడుదలైన థర్డ్ సింగిల్ ‘చిన్ని గుండెలో’ ప్రేమలో మునిగిపోయిన క్షణాలను అద్భుతంగా చూపిస్తూ, ఆడియెన్స్ హృదయాలను తాకుతోంది. రామ్ సినిమాల్లో మాస్ బీట్‌లతో పాటు మెలోడీలకు కూడా ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈసారి...
Andhra King Taluka: ‘చిన్ని గుండెలో’… ప్రేమలో తేలిపోయే మాజికల్ మెలోడీ!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ నుంచి తాజాగా విడుదలైన థర్డ్ సింగిల్ ‘చిన్ని గుండెలో’ ప్రేమలో మునిగిపోయిన క్షణాలను అద్భుతంగా చూపిస్తూ, ఆడియెన్స్ హృదయాలను తాకుతోంది. రామ్ సినిమాల్లో మాస్ బీట్‌లతో పాటు మెలోడీలకు కూడా ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈసారి కూడా అదే మ్యాజిక్‌ను కొనసాగిస్తూ, వివేక్ & మర్విన్ అందించిన ఈ రొమాంటిక్ నంబర్ క్లాసీ టచ్‌తో మంత్రముగ్ధులను చేస్తోంది.

పాట మొదలవ్వగానే సముద్రతీరంలో నక్షత్రాల కింద కూర్చొని గాలి తాకిడిని ఆస్వాదిస్తున్న హీరో–హీరోయిన్ సన్నివేశం మనసును కట్టిపడేస్తుంది. హీరోయిన్ “సమయం వేగంగా సాగిపోతుంది” అని చెబుతుంటే, హీరో “మనమే ఈ క్షణాన్ని ఆపొచ్చు” అని చెప్పే లైన్‌తో పాట ఆరంభమవుతుంది.

మర్విన్ సొలోమన్, సత్య యామినీ వోకల్స్ ఈ పాటకు ప్రాణం పోశాయి. వారి వాయిస్ టెక్స్చర్, మెలోడీ ఫ్లోలో ఉన్న సౌకర్యం పాటను మరింత మృదువుగా మార్చింది. కృష్ణకాంత్ రాసిన సాహిత్యం ప్రేమలో ఉన్న ఆ మధురమైన అనుభూతిని మాటల్లో అద్భుతంగా మలచింది. “చిన్ని గుండెలో నువ్వుంటే చాలు, ప్రపంచం ఆగిపోతుంది…” లాంటి లైన్లు ఈ సాంగ్‌ని సౌల్‌ఫుల్‌గా మార్చాయి.

సంగీతం విషయంలో వివేక్ & మర్విన్ మెలోడీని చాలా ఫ్రెష్‌గా, క్లాసికల్ టచ్ లేకుండా మోడరన్ రొమాన్స్ వైబ్‌తో ప్రెజెంట్ చేశారు.

ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ విషయానికి వస్తే, రామ్ మరియు భాగ్యశ్రీ బోర్స్ జంట తెరపై అమాయకమైన ప్రేమతో మెరిసిపోయారు. వారి expressions, eye contact, playful moments ఈ సాంగ్‌ని విజువల్‌గా క్యూట్‌గా తీర్చిదిద్దాయి.

జానీ మాస్టర్ కొరియోగ్రఫీ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రతి స్టెప్, ప్రతి మూవ్ మెలోడీ బీట్‌కు సరిగ్గా సరిపోయేలా ఉండడం ఈ సాంగ్‌కు మరో హైలైట్. స్లో-మోషన్ షాట్స్, వెన్నెల్లో షూట్ చేసిన ఫ్రేమ్స్ సినిమాటోగ్రాఫర్ టచ్‌ని అద్భుతంగా చూపిస్తున్నాయి.

మొత్తం మీద, ‘చిన్ని గుండెలో’ రామ్ ఫిల్మోగ్రఫీలో ఒక ప్యూర్ మెలోడీగా నిలుస్తుంది. ప్రేమలో తేలిపోతున్నవారికి, హృదయంతో వినేవారికి ఈ పాట ఒక ఎమోషనల్ జర్నీలా అనిపిస్తుంది.

మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవంబర్ 28న థియేటర్లలో విడుదల కానుంది. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading