సినిమా వార్తలు

చరణ్ అభిమానులకు క్షమాపణ చెబుతున్నా: శిరీష్

Published by
Srinivas

ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ గురించి తాను చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, ఆయన అభిమానులకు మరియు స్వయంగా చరణ్‌కు క్షమాపణలు చెప్పారు ప్రముఖ నిర్మాత శిరీష్ రెడ్డి.

“మా సంస్థకు రామ్ చరణ్ గారితో, చిరంజీవి గారితో ఎంతో అవినాభావ సంబంధం ఉంది. చరణ్ గారితో నాకు మంచి వ్యక్తిగత అనుబంధం ఉంది. ఆయన నా అభిమాన హీరోలలో ఒకరు. ఆయన్ని అవమానపరచడం నా స్వభావం కాదు, నా జీవితంలో అలా చేసే వ్యక్తిని కాదు,” అని అన్నారు.

తన ఇంటర్వ్యూలో చరణ్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కొన్ని అభిమానులకు తప్పుడు అర్థం కావడంతో, వెంటనే స్పందించిన ఆయన ఇలా స్పష్టం చేశారు:

“చరణ్ గారిని అవమానించే ఉద్దేశం ఏ మాత్రం లేదు. మా మధ్య ఉన్న క్లోజ్ రిలేషన్‌షిప్‌లో మాట దొర్లింది. కానీ అది అపార్థం కావడం వల్ల నేను వ్యక్తిగతంగా బాధపడ్డాను. అభిమానుల బాధను అర్థం చేసుకోగలను. అందుకే నిజమైన మనసుతో క్షమాపణలు చెబుతున్నాను.”

ఇప్పటి వరకు మెగా హీరోలతో తమ సంస్థ నిర్మించిన చిత్రాలను గుర్తు చేస్తూ, ఆయన అన్నారు:
“వ‌రుణ్ తేజ్‌తో ‘ఫిదా’, సాయితేజ్ గారితో రెండు చిత్రాలు, చరణ్ గారితో రెండు సినిమాలు చేశాం. చిరంజీవి గారు మరియు దిల్ రాజు గారితో మాకు సుదీర్ఘ అనుబంధం ఉంది. ఈ స్థాయిలో ఉన్న అనుబంధాన్ని పాడు చేసుకునే వ్యక్తిని కాదు.”

అంతేకాక, ఒక సందర్భంలో చరణ్ ఇచ్చిన సహకారాన్ని గుర్తు చేస్తూ – “సంక్రాంతికి విడుదలైన ఓ సినిమాలో చరణ్ గారు ఒప్పుకోకపోతే అది విడుదలయ్యేది కాదు. ఆయన గొప్ప మనసు వల్లే అది సాధ్యమైంది. అలాంటి వ్యక్తిని ఎందుకు అవమానపరచాలి?” అంటూ ఆయన స్పష్టం చేశారు.

“దయచేసి మా మధ్య ఉన్న మంచి రిలేషన్‌ను పాడు చేయొద్దు. మళ్లీ రాబోయే ప్రాజెక్టులో చరణ్ గారితో కలిసి పనిచేయబోతున్నాం. ఎటువంటి అభిప్రాయ భేదాలు లేకుండా ముందుకు సాగాలని ఆశిస్తున్నాను.” అని పేర్కొన్నారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts

  • సినిమా వార్తలు

హీరోయిన్లతో రూమర్స్… భయపడిన నాగవంశీ?

నవంబర్ 17, 2026