మాస్ మహారాజా రవితేజ మరోసారి కుటుంబ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ భర్త మహాశయులకు విజ్ఞప్తి ఈ సంక్రాంతికి అద్భుతమైన వినోదాన్ని అందించనుంది.
ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై భారీ అంచనాలు పెంచుతూ మ్యాసివ్ బజ్‌ను సృష్టించాయి. ఫ్యామిలీ ఎమోషన్, హ్యూమర్, ఎంటర్‌టైన్‌మెంట్ అన్నీ సమపాళ్లలో ఉండనున్నాయని మేకర్స్ చెబుతున్నారు.
తాజాగా క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ చిత్ర బృందం ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఆ పోస్టర్‌లో రవితేజ సాంటా క్యాప్ పెట్టుకుని, చేతిలో గిఫ్ట్ పట్టుకొని ఫెస్టివ్ వైబ్‌లో కనిపించడం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో ఈ పోస్టర్ వైరల్‌గా మారింది.
అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో రూపొందుతున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సంక్రాంతికి పర్ఫెక్ట్ ఫ్యామిలీ మూవీగా నిలవనుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. జనవరి 13న ఈ చిత్రం గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలై ప్రేక్షకులకు పండుగ కానుకగా రానుంది.