Download App

“ప్రేక్షక మహాశయుల విజ్ఞప్తి”…

జనవరి 20, 2026 By Suresh Thota
కిషోర్ తిరుమల దర్శకత్వంలో "రవితేజ" హీరో గా SLV సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన చిత్రం "భర్త మహాశయులకు విజ్ఞప్తి". ఈ సినిమా ఒక లైట్ హార్ట్‌డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. రవితేజ కామెడీ, ఎనర్జీ, చాలా బాగున్నాయి. జంధ్యాల గారు… కొబ్బరికాయ చట్నీ చాలా బాగుంది....
"ప్రేక్షక మహాశయుల విజ్ఞప్తి"…

కిషోర్ తిరుమల దర్శకత్వంలో “రవితేజ” హీరో గా SLV సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన చిత్రం “భర్త మహాశయులకు విజ్ఞప్తి”. ఈ సినిమా ఒక లైట్ హార్ట్‌డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. రవితేజ కామెడీ, ఎనర్జీ, చాలా బాగున్నాయి.

జంధ్యాల గారు… కొబ్బరికాయ చట్నీ చాలా బాగుంది. కాస్త కొబ్బరి తురుము కూడా వేస్తే ఇంకా బాగుండేది అన్నారట.

అలా ఉంది…. ఈ చిత్రం…. రవితేజ అనే ఒక వ్యక్తి వివాహితుడైనప్పటికి జీవితంలో అనుకోని, సంఘటనలు మూలంగా జరిగిన కథ. రవితేజ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, కామెడీ సీన్స్‌లో ఆయన టైమింగ్ అద్భుతం. హీరోయిన్స్ , సహాయ నటులు, ముఖ్యంగా కామెడీ ఆర్టిస్టులు సినిమాకి మంచి బలం అనుకున్నారు. కథ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఈ సినిమా దర్శక, నిర్మాతలు పండగ సీజన్ లో చక్కబెట్టేసుకుందాం అనుకున్నారు అనుకుంటా…. అన్ని సినిమాలకు… అన్ని సార్లు అలా జరగదు… ముహూర్త బలం… చాలా బలంగా ఉండాలి సుమా… సెకండ్ హాఫ్‌ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. కొన్ని సీన్స్ రిపీట్ ఫీలింగ్ ఇస్తాయి.

కథ మీద దృష్టి పెట్టరు… హీరో ఇన్ని రోజులు డేట్స్ ఇచ్చాడు… సినిమా తీసేయాలి….అని ప్రొడ్యూసర్… నిర్మాత దొరికాడు కథ తర్వాత చూసుకుందాం హీరో కి లైన్ నచ్చింది చాలు అని దర్శకుడు… మనకు రెమ్యునరేషన్ అందింది చాలు అని హీరో భావిస్తే… ఇటువంటి చిత్రాలే వస్తాయి….

రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ కథ కి స్పెయిన్ వరకు వెళ్లాలా….?

మొత్తంగా… “భర్త మహాశయులకు విజ్ఞప్తి” ఒక భారీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రిలీజ్ చేశారు… పాపం “ప్రేక్షక మహాశయులు మాత్రం శిరోబారం”తో బయటకు వచ్చారు. జనం ఈ సినిమాను ఎందుకు బాగాలేదు అంటున్నారు… కథలో కొత్తదనం లేకపోవడం… ఈ సినిమా కథ రొటీన్‌గా ఉన్నా, కథనంలో కొత్తదనం లేకపోవడం. విరామం తరువాత సాగతీతనే ఈ సినిమాకు బలంలా ఉంది . కథ లేకుండా రెండవ భాగం నడపడం లోనే దర్శకుడు కృతకృత్యుడు అయ్యాడు… క్లైమాక్స్ చాలా బలహీనంగా ఉంది. దీని గురించి తక్కువగా మాట్లాడటం ఉత్తమం.

“పులిహోర కి తాలింపు ఎలానో… భార్యకు లాలింపు” అలాగ అన్నట్టుగా చూపించారు… ఏ భార్య ను అయినా భర్తనే లాలిస్తాడు… కాని అంత పవర్ ఫుల్ గా చూపించిన భార్యను క్లైమాక్స్ లో అలా నీరసంగా చూపించడం లో దర్శకుడు యొక్క కథ లో వైఫల్యం కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది.

మీ దగ్గర కథ లేనప్పుడు… ఏదైనా హిట్ చిత్రాన్ని రీమేక్ రైట్స్ అయినా తీసుకోవాలి. కె. భాగ్యరాజా “చిన్న రాజా” సినిమా ఇవివి “అబ్బాయిగారు” లా… యద్దనపూడి సులోచన రాణి రచన…. విజయనిర్మల దర్శకత్వంలో వచ్చిన “మీనా” ను, ప్రేరణ గా తీసుకున్న త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన “అ ఆ” లా లేదా “ఇల్లు, ఇల్లాలు”, “ఉమ్మడి మొగుడు”, ఆయనకు ఇద్దరు”, “రెండు తోకల పిట్ట” ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి…. మీరు కథ మీద దృష్టి పెట్టీ కూర్చోవాలి గాని…. “చిన్న ఇల్లు” భాగ్యరాజా దర్శకత్వంలో .. “ఇంటిలో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు” ఇవివి దర్శకత్వంలో వచ్చాయి. ఈ చిత్రాలను తీసుకుని చేసి ఉన్నా సరిపోయేది… ఇవి మా మాటలు కాదు, సినిమా చూసిన వారి మాటలు మాత్రమే.

హీరో రవితేజ కథల మీద దృష్టి పెట్టరు అనుకుంటా… ఈ హీరోకి “యధాస్థానం ప్రవేశ యామి” అన్నట్టుగా… ఇది కూడా చేజారిపోయింది.

సారాంశం: హీరో గారు… డేట్స్ ఇన్ని రోజులు అని లెక్కపెట్టి ఇవ్వకండి. కథ లేనప్పుడు మీరు ఎంత నటించినా వ్యర్ధమే… కథకు ప్రాధాన్యత ఇవ్వండి.

Suresh Thota

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading