Download App

సుకుమార్ క్లాప్.. అల్లు అరవింద్ ఫస్ట్ క్లాప్.. ఘనంగా సిద్ధు జొన్నలగడ్డ ‘సిద్ధు10’ ప్రారంభం!

నవంబర్ 11, 2026 • By Srinivas
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘సిద్ధు10’ హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. సరికొత్త ప్రేమకథతో తెరకెక్కనున్న ఈ సినిమాతో మోహన్ బి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తబిత సుకుమార్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అన్మోల్...
సుకుమార్ క్లాప్.. అల్లు అరవింద్ ఫస్ట్ క్లాప్.. ఘనంగా సిద్ధు జొన్నలగడ్డ ‘సిద్ధు10’ ప్రారంభం!

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘సిద్ధు10’ హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. సరికొత్త ప్రేమకథతో తెరకెక్కనున్న ఈ సినిమాతో మోహన్ బి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తబిత సుకుమార్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అన్మోల్ శర్మ, బన్నీ వాస్, అశోక్ బండ్రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

‘ఇడుపు కాయితం’ తర్వాత సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ కలిసి నిర్మిస్తున్న రెండో చిత్రమిది. ప్రస్తుతం ‘ఇడుపు కాయితం’ విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ టీమ్‌లో కీలకంగా పనిచేసిన మోహన్ బి.. ఈ సినిమా కోసం ఓ అందమైన, విభిన్నమైన ప్రేమకథను సిద్ధం చేశారు. ఇందులో సిద్ధు జొన్నలగడ్డను ఇప్పటివరకు చూడని సరికొత్త అవతార్‌లో చూపించనున్నారు. ఆయనకు జోడీగా నయన్ సారిక కథానాయికగా నటిస్తున్నారు.

హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రారంభోత్సవ వేడుకకు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మాస్టర్ స్టోరీ టెల్లర్ సుకుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, అగ్ర నిర్మాత అల్లు అరవింద్ తొలి క్లాప్ ఇచ్చారు. నిర్మాతలు విశ్వప్రసాద్, బాపినీడు, దర్శకులు బుచ్చిబాబు, చందూ మొండేటి చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందించారు. దర్శకులు హరీశ్ శంకర్, నందినీ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ప్రముఖుల సమక్షంలో ఈ సినిమా ఘనంగా ప్రారంభమైంది.

సుకుమార్ క్లాప్.. అల్లు అరవింద్ ఫస్ట్ క్లాప్.. ఘనంగా సిద్ధు జొన్నలగడ్డ ‘సిద్ధు10’ ప్రారంభం!

ప్రారంభోత్సవం సందర్భంగా విడుదల చేసిన థీమ్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. పచ్చని చెట్ల మధ్య భారీ జలపాతం, దాని మధ్యలో వేలాడుతున్న ఉయ్యాల పోస్టర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎరుపు, పసుపు, నలుపు రంగుల్లో ప్రవహిస్తున్న వస్త్రం పోస్టర్‌కు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. నాస్టాల్జియా, ప్రేమ, కవితాత్మకమైన భావాలను ప్రతిబింబించేలా రూపొందించిన ఈ పోస్టర్.. సినిమాలోని భావోద్వేగభరితమైన ప్రేమ ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది.

ఈ చిత్రానికి ప్రతిభావంతమైన సాంకేతిక బృందం పనిచేస్తోంది. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, చంద్రు సెల్వరాజ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ సాహి సురేష్ ఈ సినిమా కోసం ప్రత్యేకమైన విజువల్ వరల్డ్‌ను రూపొందించనున్నారు.

సిద్ధు జొన్నలగడ్డ, సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ కలయికలో వస్తున్న ఈ చిత్రం ఇప్పటికే మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. విభిన్నమైన ప్రేమకథతో సిద్ధు ప్రేక్షకులను ఎలా అలరిస్తారో చూడాలి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts