Download App

“న భూతే… న భవిష్యత్”… నా…?

ఫిబ్రవరి 5, 2026 • By Suresh Thota
సభా సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. కొంతమంది ఏమి మాట్లాడుతున్నారో… ఏమి పాడుతున్నారో వాళ్ళకే అర్థం కావడం లేదు. చాలా మంది మైక్ కనపడితే చాలు, మైకాసురులు లా తయారు అవుతున్నారు. చిరంజీవిని చూసి ఇండస్ట్రీ కి వచ్చాము అంటారు చాలా మంది హీరోలు… కాని ఆయన దగ్గర నుండి...
"న భూతే... న భవిష్యత్"... నా...?

సభా సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. కొంతమంది ఏమి మాట్లాడుతున్నారో… ఏమి పాడుతున్నారో వాళ్ళకే అర్థం కావడం లేదు. చాలా మంది మైక్ కనపడితే చాలు, మైకాసురులు లా తయారు అవుతున్నారు.

చిరంజీవిని చూసి ఇండస్ట్రీ కి వచ్చాము అంటారు చాలా మంది హీరోలు… కాని ఆయన దగ్గర నుండి ఏమి నేర్చుకున్నారు అంటే చాలామంది దగ్గర జవాబు శూన్యమే… ఒకసారి వేదిక ఎక్కిన తరువాత ఏమి మాట్లాడాలి… ఎలా మాట్లాడాలి అన్నది ఆయనను చూసి కూడా నేర్చుకోకపోతే ఎట్లా…

టాలీవుడ్ నటుడు చంద్రహాస్ మొన్న జరిగిన తన చిత్రం “బరాబర్ ప్రేమిస్తా” ప్రీ-రిలీజ్‌ ప్రమోషన్ వేదిక పై ‘గుంజీ గుంజీ’ అనే పాటలో బూతు పదాలు పలకడం వల్ల అది నెటిజన్లలో పెద్ద వివాదానికి దారితీసింది. ఈ వివాదం మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు వరకు వెళ్ళింది. ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అందరికీ చిత్ర పరిశ్రమలో అందలం ఎక్కాలి అనే ఆశ ఉంటుంది… కాని దానికి మన నడవడిక ఎలా ఉండాలి అన్నది నేర్చుకోరు… ప్రెస్ మీట్ లో టేబుల్ మీద కాళ్ళు చాపి కూర్చునే వ్యక్తి ఒకరైతే… బూతుపాటలు పాడేవారు ఒకరు… వీరికి సభాసంస్కారం నేర్పేది ఎవరు… చీప్ పబ్లిసిటీతో రాణించాలనుకోవడం అంటే… తన దగ్గర కాని , తన సినిమా లో కాని విషయం లేదు అని పరోక్షంగా ఒప్పుకున్నట్లే.

కొంతమంది JD చక్రవర్తి ని పరోక్షంగా విమర్శిస్తున్నారు. JD చక్రవర్తి నోటినుండి వెటకారం డైలాగ్స్ వస్తాయేమో కాని , ఒక్క అశ్లీల పదం రాదు. ఆ ఫంక్షన్ లో నిజంగా చెప్పాలంటే ఆయన సరిగ్గా విని ఉండకపోయే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఆయన్ని కొంతమంది తప్పు పట్టడం… హాస్యాస్పదం… ఆయన వెంటనే బయలుదేరి బయటకు వచ్చేసి ఉండాల్సింది. ఆయన ఈ చిత్ర హీరో వేదిక మీద పాడిన బూతు పాటను ఖండించడం ద్వారా… ఈ “బారాబర్ ప్రేమిస్తా” చిత్రానికి ఈ రూపంలో పబ్లిసిటీ ఇస్తున్నారు.

ఇక హీరో విషయానికి వస్తే, ఆయన అందగాడు కావచ్చు… కాని వేదిక మీద తను పాడిన పాట కు నేను సారీ చెప్పను అనే వైఖరి… అతనికే నష్టం చేకూరుస్తుంది. నేటి యువత ఆయన మాటలు, పాడిన పాట ఎంజాయ్ చేసి ఉండవచ్చు… కాని కుటుంబ సభ్యులు అందరూ కలసి చూసే విధంగా ఆయన తీరు , నడవడిక లేకపోతే పబ్లిక్ లో సహజంగానే ఇతని చిత్రాన్ని చూడాలనే ఆశక్తి చూపరు. మంచి హీరో అనిపించుకోవాలి అంటే కథ మీద, నటన మీద దృష్టి పెట్టాలి. అంతేగాని బూతుల మీద కాదు.

ఈ పాటలోని బూతు పదాల కారణంగా ప్రజలు “చంద్రహాస్” సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు, విమర్శలు వస్తున్నాయి. ఈటీవీ ప్రభాకర్ ఇన్ని సంవత్సరాల అనుభవం ఏమైందో అర్ధం కావడం లేదు అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు.

తెలుగు చిత్ర పరిశ్రమ కి భారీ హీరో అవుదామని అనుకోవడం తప్పులేదు. మీ వైఖరితో భారమైన హీరో కాకుంటే చాలు.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading