
కమిటీ కుర్రోళ్లు చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసిన దర్శకుడు యదు వంశీ తన రెండో సినిమా పనులను అధికారికంగా ప్రారంభించారు. ఈ క్రమంలో రాబోయే ప్రాజెక్ట్ కోసం 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అచ్చ తెలుగు యువ మహిళా నటి కోసం ఓపెన్ కాస్టింగ్ కాల్‌ను ప్రకటించారు. నటన, ప్రతిభకే ప్రాధాన్యం ఇచ్చే ఈ ప్రక్రియ ద్వారా తెలుగు సినిమాల్లోకి కొత్త ప్రతిభను తీసుకురావడమే లక్ష్యంగా యదు వంశీ ముందుకు సాగుతున్నారు.
‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో ఏకంగా 15 మంది కొత్త ఆర్టిస్టులు వెండితెరపైకి రావడం తెలిసిందే. గ్రామీణ నేపథ్యంతో, రూటెడ్ కథనంతో తెరకెక్కిన ఈ సినిమా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో విశేష గుర్తింపు సాధించింది. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్‌లో అత్యున్నత పురస్కారాలు దక్కించుకోవడంతో పాటు, దుబాయ్‌లోని గల్ఫ్ అకాడమీ మూవీ అవార్డ్స్ (GAMA)లో అంతర్జాతీయ ప్రశంసలు పొందింది. అలాగే 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో ‘ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ – ఇండియన్ ఫీచర్ ఫిల్మ్’ విభాగంలో ప్రతిష్టాత్మక నామినేషన్‌ను కూడా అందుకుంది. రూటెడ్ కథలు చెప్పాలన్న యదు వంశీ నిబద్ధతకు ఇవన్నీ బలమైన సాక్ష్యాలుగా నిలిచాయి.
ఈ తాజా కాస్టింగ్ కాల్‌తో కొత్త ముఖాల అన్వేషణపై దర్శకుడు ప్రత్యేక దృష్టి సారించారు. ఉత్సాహం, ఆత్మవిశ్వాసం, సాంస్కృతిక మూలాలను సహజంగా ప్రతిబింబించే “అచ్చమైన తెలుగు అమ్మాయి” కోసం వెతుకుతున్నారు. గ్లామర్ కంటే వ్యక్తీకరణ సామర్థ్యం, భావోద్వేగ లోతు, తెలుగు భాషపై ఉన్న పట్టు వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
మన మట్టికథల్ని నిజాయితీగా చెప్పాలంటే, ఆ భావాలను పండించి చూపించగల ఆర్టిస్టులు అవసరమని యదు వంశీ అభిప్రాయపడుతున్నారు. అందుకే ఈ అవకాశం పూర్తిగా తెలుగు యువతకే. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ ఆడిషన్ వీడియోలను నేరుగా బృందానికి పంపవచ్చు.
ఈమెయిల్: yadhuvamseeYV2@gmail.com
వాట్సాప్: 8639164104
కాస్టింగ్ కాల్ ప్రస్తుతం కొనసాగుతుండగా, వచ్చిన ఎంట్రీలను నిరంతరం సమీక్షించనున్నారు.
ఈ సృజనాత్మక ప్రకటన వెనుక Pink Elephant Pictures ఉంది. నిజాయితీగల ప్రతిభను ప్రోత్సహిస్తూ, కంటెంట్-ఆధారిత తెలుగు సినిమాలను బలోపేతం చేయాలన్న తన నిబద్ధతను ఈ కాస్టింగ్ కాల్‌తో మరోసారి చాటుకుంది. పరిశ్రమ విస్తరిస్తున్న ఈ సమయంలో కొత్తవారికి వేదిక కల్పించే ఈ అవకాశం అనేక మంది యువ ఆశావహులకు సినిమా ప్రయాణంలో తొలి మెట్టుగా మారనుంది. బెంచ్‌మార్క్ సెట్ చేసిన టీంతో కలిసి పని చేసే ఈ అవకాశాన్ని మిస్ కాకండి.
