Download App

పవన్ కళ్యాణ్ అభిమానులకు డబుల్ సర్‌ప్రైజ్

ఆగస్ట్ 20, 2025 • By Srinivas
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తెరపై దర్శనమివ్వబోతున్నారు "They Call Him OG" సినిమా ద్వారా. రీసెంట్ గా రిలీజ్ అయిన ఫస్టర్మ్ అభిమానులను ఒక ఊపు ఊపేస్తోంది. థమన్ ఇచ్చిన మ్యూజిక్ పై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఆయన పుట్టినరోజు దగ్గరపడుతున్న తరుణంలో...
పవన్ కళ్యాణ్ అభిమానులకు డబుల్ సర్‌ప్రైజ్

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తెరపై దర్శనమివ్వబోతున్నారు “They Call Him OG” సినిమా ద్వారా. రీసెంట్ గా రిలీజ్ అయిన ఫస్టర్మ్ అభిమానులను ఒక ఊపు ఊపేస్తోంది. థమన్ ఇచ్చిన మ్యూజిక్ పై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఆయన పుట్టినరోజు దగ్గరపడుతున్న తరుణంలో అభిమానులకు ఒక మైండ్ బ్లోయింగ్ సర్‌ప్రైజ్ రెడీగా ఉంది. అదేంటంటే, పవన్ కెరీర్‌లో కల్ట్ హిట్స్‌గా నిలిచిన ‘తమ్ముడు’ మరియు ‘జల్సా’ సినిమాలు మళ్లీ థియేటర్లలోకి రాబోతున్నాయి. అంతే కాదు, ఈ రెండు చిత్రాలు కూడా ఒకేసారి ఆగస్టు 30, 2025 న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

మొదటగా ‘తమ్ముడు’ రీ-రిలీజ్‌ను సెప్టెంబర్ 2, 2025 న ప్లాన్ చేశారు. కానీ అభిమానుల ఎక్సైట్మెంట్‌ను దృష్టిలో పెట్టుకొని రిలీజ్ డేట్‌ను ముందుకు తీసుకువచ్చారు. కాబట్టి, పవర్‌స్టార్ ఫ్యాన్స్‌కు ఇది నిజంగా డబుల్ ట్రీట్ అని చెప్పొచ్చు.

పవన్ కళ్యాణ్ అభిమానులకు డబుల్ సర్‌ప్రైజ్

తమ్ముడు (1999):

స్పోర్ట్స్ మరియు ఫ్యామిలీ ఎమోషన్స్‌ను బ్యూటిఫుల్‌గా మిళితం చేసిన ఈ సినిమా ఇప్పటికీ పవన్ కెరీర్‌లో ఒక బెస్ట్‌ మూవీగా చెప్పుకోవచ్చు. పి.ఏ. అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి రమణ గోగుల సమకూర్చిన సంగీతం అప్పట్లోనే కాదు ఇప్పటికీ యువతను ఉర్రూతలూగిస్తుంది. బురుగుపల్లి శివరామకృష్ణ నిర్మించిన ఈ సినిమాలో పవన్ సరసన ప్రీతి జంగియానీ, అదితి గోవిత్రికర్, అచ్యుత్ ముఖ్య పాత్రల్లో నటించారు.

పవన్ కళ్యాణ్ అభిమానులకు డబుల్ సర్‌ప్రైజ్

జల్సా (2008):

మరోవైపు, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ మూవీ అప్పట్లోనే పెద్ద సెన్సేషన్‌గా నిలిచింది. పవన్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో పాటు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఇంకా ఫ్యాన్స్ ప్లేలిస్టుల్లో టాప్‌లోనే ఉంది. ఈ చిత్రంలో పవన్ సరసన ఇలియానా, కమలినీ ముఖర్జీ, పార్వతి మెల్టన్ నటించారు.

ఈ రెండు సినిమాలు ఒకేసారి థియేటర్లలో రీ-రిలీజ్ అవ్వడం పవన్ అభిమానులకు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చేలా ఉంది. పవర్‌స్టార్ పుట్టినరోజు వారం అంతా పవన్ అభిమానులు సంబరాల్లో మునిగిపోనున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts