‘గుర్రం పాపిరెడ్డి’ నుంచి ఫరియా అబ్దుల్లా ‘పాపి పాపి’ పాట విడుదల
December 19, 2025 Published by Srinivas

ఈ శుక్రవారం విడుదలవుతున్న ముఖ్యమైన తెలుగు చిత్రాల్లో ‘గుర్రం పాపిరెడ్డి’ ఒకటి. వినూత్నమైన టైటిల్‌తో పాటు సరదా, హ్యూమర్‌తో నిండిన ప్రమోషన్లతో ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. డార్క్ కామెడీ జానర్‌లో తెరకెక్కిన ఈ చిత్రం, తెలుగులో ఇప్పటివరకు ప్రయత్నించని కొత్త కాన్సెప్ట్‌తో రాబోతుండటం విశేషం.
నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా టీమ్ ప్రేక్షకులతో వినూత్నంగా మమేకమవుతోంది. విడుదలకు ముందురోజు మేకర్స్ ప్రత్యేకంగా ‘పాపి పాపి’ అనే ప్రమోషనల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకు కృష్ణ సౌరభ్ ఎనర్జిటిక్ మ్యూజిక్ అందించగా, లిరిక్స్‌ను ఫారియా అబ్దుల్లానే రాయడం మరో ప్రత్యేకతగా నిలిచింది.
రాప్ ఫార్మాట్‌లో రూపొందిన ఈ పాట మొదటి వినిపించగానే ఆకట్టుకునేలా ఉంది. ఫారియా అబ్దుల్లాతో పాటు హీరో నరేష్ అగస్త్య, నటులు రాజ్‌కుమార్ కాసిరెడ్డి, వంశీధర్ కోసిగి ఈ పాటలో కనిపిస్తూ సంప్రదాయ వేషధారణలో అదనపు ఆకర్షణగా నిలిచారు. పాటలోని హ్యూమర్, ఎనర్జీ సినిమాపై ఉన్న ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.
మురళి మనోహర్ దర్శకత్వం వహించిన ‘గుర్రం పాపిరెడ్డి’ చిత్రాన్ని వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డిసెంబర్ 19న థియేటర్లలో విడుదలకు సిద్ధమైన ఈ సినిమా, వినూత్న కథనం మరియు డార్క్ కామెడీ టచ్‌తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుందని చిత్ర బృందం విశ్వాసం వ్యక్తం చేస్తోంది.
