Download App

కొరియాలో ఫైనల్ షెడ్యూల్… ముగింపు దశలో ‘కొరియన్ కనకరాజు’ షూటింగ్

మార్చి 14, 2026 By Srinivas
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కొరియన్ కనకరాజు’ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ మరియు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. లావిష్ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా...
కొరియాలో ఫైనల్ షెడ్యూల్… ముగింపు దశలో ‘కొరియన్ కనకరాజు’ షూటింగ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కొరియన్ కనకరాజు’ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ మరియు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. లావిష్ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా హారర్ – కామెడీ జానర్‌లో రిఫ్రెషింగ్ క్రాస్ కల్చరల్ ట్విస్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇండియన్ మరియు కొరియన్ నేపథ్యాల కలయికలో రూపొందుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఇంతకు ముందు కనిపించని కొత్త తరహా పాత్రలో దర్శనమివ్వనున్నారు.

ఇప్పుడు మూవీ టీమ్ సౌత్ కొరియాలో ఫైనల్ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభించింది. సుమారు ఒక వారం రోజుల పాటు కొనసాగే ఈ కీలక షెడ్యూల్‌లో పాటలతో పాటు కథలో ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ షూటింగ్‌లో వరుణ్ తేజ్, రిథికా నాయక్, సత్య పాల్గొననుండగా, కొరియాలోని అందమైన లొకేషన్లలో చిత్రీకరణ జరగనుంది.

ఇటీవల వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘కొరియన్ కనకరాజు’ టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన అందుకుంది. స్టైలిష్ ప్రెజెంటేషన్ మరియు ఎంటర్టైనింగ్ టోన్‌తో వచ్చిన ఆ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది. అలాగే సినిమాలో ఉండబోయే హిలేరియస్ హారర్-కామెడీ ప్రపంచాన్ని ఆ గ్లింప్స్ ప్రేక్షకులకు పరిచయం చేసింది.

కొరియాలో ఫైనల్ షెడ్యూల్… ముగింపు దశలో ‘కొరియన్ కనకరాజు’ షూటింగ్

సంగీతం ఎస్. తమన్ అందిస్తున్న ఈ చిత్రానికి ఎనర్జీతో నిండిన పాటలతో పాటు ఆకట్టుకునే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయన ప్రత్యేకంగా చార్ట్‌బస్టర్ ఆల్బమ్ కంపోజ్ చేస్తున్నట్టు సమాచారం.

ఇప్పటికే ఇండియాలో ప్రధాన భాగం షూటింగ్ పూర్తికాగా, కొరియాలో జరుగుతున్న ఈ ఫైనల్ షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తికానుంది. అనంతరం చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి ప్రవేశించనుంది.

త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటించడంతో పాటు ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు.

ఈ చిత్రానికి మనోజ్ రెడ్డి కాటసాని సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సత్య జి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వరుణ్ తేజ్ కరిస్మాటిక్ స్క్రీన్ ప్రెజెన్స్, మేర్లపాక గాంధీ హిలేరియస్ కథనం, అలాగే యూవీ క్రియేషన్స్ – ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణ విలువలతో ‘కొరియన్ కనకరాజు’ ఒక పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading