Download App

రాక్‌స్టార్ నుంచి నటుడిగా.. ‘ఎల్లమ్మ’లో దేవిశ్రీ ప్రసాద్ ఫస్ట్ లుక్ విడుదల

ఆగస్ట్ 3, 2026 • By Srinivas
నేషనల్ అవార్డు గ్రహీత దర్శకుడు వేణు యెల్దండి, బలగం వంటి సంచలన విజయానంతరం తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఎల్లమ్మ'. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను సొంతం చేసుకుంది. భావోద్వేగాలకు, తెలంగాణ...
రాక్‌స్టార్ నుంచి నటుడిగా.. 'ఎల్లమ్మ'లో దేవిశ్రీ ప్రసాద్ ఫస్ట్ లుక్ విడుదల

నేషనల్ అవార్డు గ్రహీత దర్శకుడు వేణు యెల్దండి, బలగం వంటి సంచలన విజయానంతరం తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఎల్లమ్మ’. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను సొంతం చేసుకుంది. భావోద్వేగాలకు, తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే ఈ చిత్రంలో రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ తొలిసారి కథానాయకుడిగా నటిస్తుండటం విశేషం. అంతేకాదు, ఈ సినిమాకు సంగీతాన్ని కూడా ఆయనే అందిస్తున్నారు.

దేవిశ్రీ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం సోమవారం ఆయన ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. ఇందులో ‘పర్షి’ అనే పాత్రలో దేవిశ్రీ ప్రసాద్ కనిపించగా, పోస్టర్‌కు అభిమానుల నుంచి, సినీ వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

ఇటీవలి కాలంలో భారీ యాక్షన్ పోస్టర్లు, మాస్ ఎలివేషన్ల మధ్య ‘ఎల్లమ్మ’ ఫస్ట్ లుక్ మాత్రం పూర్తిగా భిన్నంగా నిలిచింది. సాధారణ దుస్తుల్లో, చేతిలో ఒక కిరీటాన్ని పట్టుకుని ఎంతో సహజంగా నిలబడ్డ దేవిశ్రీ ప్రసాద్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అతిశయోక్తికి దూరంగా, పాత్ర స్వభావాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.

రాక్‌స్టార్ నుంచి నటుడిగా.. 'ఎల్లమ్మ'లో దేవిశ్రీ ప్రసాద్ ఫస్ట్ లుక్ విడుదల

ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ కళ్లలో కనిపించే అమాయకత్వం, సహజమైన అభినయం ‘పర్షి’ పాత్రపై వెంటనే అనుబంధాన్ని కలిగించేలా ఉంది. తొలి సినిమానే అయినప్పటికీ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయినట్లు ఆయన కనిపించడం దర్శకుడు వేణు యెల్దండి విజన్‌కు నిదర్శనంగా చెప్పవచ్చు.

బలగంతో భావోద్వేగాలను అద్భుతంగా తెరపై ఆవిష్కరించిన వేణు యెల్దండి, ‘ఎల్లమ్మ’ను తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ఎన్నో సంవత్సరాలుగా తీర్చిదిద్దుతున్నట్లు చిత్రబృందం తెలిపింది. కథపై ఉన్న నమ్మకం, ప్రతి అంశంలో తీసుకున్న జాగ్రత్త ఈ చిత్రాన్ని మరో ప్రత్యేక అనుభూతిగా మార్చబోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప్రకటన జరిగినప్పటి నుంచే ఆసక్తిని రేకెత్తిస్తున్న ‘ఎల్లమ్మ’, టైటిల్ గ్లింప్స్ తర్వాత ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ ఫస్ట్ లుక్‌తో మరింత హైప్‌ను సొంతం చేసుకుంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading