Download App

“నెక్ట్స్ లెవెల్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు రెడీ అవ్వండి”: Rākāsā టీజర్ లాంచ్ ఈవెంట్ లో నిహారిక

మార్చి 2, 2026 By Srinivas
ప్రముఖ నటి, నిర్మాత Niharika Konidela 2024లో విడుదలైన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు మాత్రమే కాకుండా పలు అవార్డులు కూడా అందుకున్నారు. ఆ విజయానంతరం, జీ స్టూడియోస్ సమర్పణలో తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి ఆమె నిర్మించిన తాజా...
“నెక్ట్స్ లెవెల్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు రెడీ అవ్వండి”: Rākāsā టీజర్ లాంచ్ ఈవెంట్ లో నిహారిక

ప్రముఖ నటి, నిర్మాత Niharika Konidela 2024లో విడుదలైన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు మాత్రమే కాకుండా పలు అవార్డులు కూడా అందుకున్నారు. ఆ విజయానంతరం, జీ స్టూడియోస్ సమర్పణలో తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి ఆమె నిర్మించిన తాజా చిత్రం రాకాస. Manasa Sharma దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో Sangeeth Shobhan, Nayan Sarika జంటగా నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 3న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం టీజర్‌ను ఘనంగా విడుదల చేశారు.

నిహారిక కొణిదెల మాట్లాడుతూ…

“పింక్ ఎలిఫెంట్ నుంచి వచ్చే ప్రతి కంటెంట్‌ను ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. ‘రాకాస’ కథ నాకు వెంటనే నచ్చింది. ‘కమిటీ కుర్రోళ్లు’తో మనల్ని గతంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాను. ఏ సినిమా చేసినా ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వాలన్నదే మా లక్ష్యం. ‘రాకాస’తో నెక్ట్స్ లెవెల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తాం. థియేటర్‌కు వచ్చిన వాళ్లను నిరాశపరచం. ఈ చిత్రంతో సంగీత్ మరింత షైన్ అవుతాడు. అవార్డుల కోసం కాదు, ప్యాషన్‌తో సినిమాలు చేస్తున్నాను. ‘రాకాస’ను కూడా అదే ప్రేమతో నిర్మించాను. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనుకుంటున్నాను” అని తెలిపారు.

సంగీత్ శోభన్ మాట్లాడుతూ…

“నిహారిక గారు, మానస గారి వల్లే ‘రాకాస’ ఈ స్థాయికి వచ్చింది. ఈ సినిమా కోసం వారు ఎంతో కష్టపడ్డారు. కథ విన్న వెంటనే నాకు చాలా నచ్చింది. నిర్మాతగా నిహారిక గారు ఉన్నారని తెలిసినప్పుడు మరింత కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ సినిమా అందరినీ నవ్విస్తుంది. వన్ మాన్ షోనా కాదో తెలియదు కానీ మానస గారి మాత్రం వన్ ఉమెన్ షోలా ఉంటుంది. ప్రేక్షకులు పెట్టే టికెట్ డబ్బులకు పూర్తి న్యాయం చేసే సినిమా ఇది” అని అన్నారు.

దర్శకురాలు మానస శర్మ మాట్లాడుతూ…

“‘రాకాస’ కోసం మా టీమ్ ఎంతో కష్టపడి పని చేసింది. నిహారిక వల్లే నేను దర్శకురాలిగా మారాను. ఆమెకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. సంగీత్ చాలా అంకితభావంతో పని చేస్తాడు. డైరెక్టర్లకు డ్రీమ్ యాక్టర్‌లా ఉంటాడు. ఈ కథను మహేష్ ఉప్పల గారితో కలిసి రాశాను. ఏప్రిల్ 3న సినిమా విడుదల అవుతోంది. అందరూ థియేటర్‌కు వచ్చి మా సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను” అని చెప్పారు.

జీ తెలుగు హెడ్ దివ్య మాట్లాడుతూ…

“పింక్ ఎలిఫెంట్‌తో కలిసి ‘రాకాస’ చేయడం ఆనందంగా ఉంది. నిహారికతో కలిసి పని చేయడం ఎప్పుడూ సంతోషమే. సినిమా క్వాలిటీ అందరికీ కనిపిస్తోంది. ఏప్రిల్ 3న ఈ చిత్రం మంచి విజయాన్ని సాధిస్తుంది” అని తెలిపారు.

సంగీత దర్శకుడు అనుదీప్ మాట్లాడుతూ…

“‘రాకాస’లో మూడు పాటలుంటాయి. మూవీ రిలీజ్ తర్వాత మరో పాటను విడుదల చేస్తాం. పాటలన్నీ అద్భుతంగా వచ్చాయి. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారని నమ్ముతున్నాను” అని అన్నారు.

గెటప్ శ్రీను మాట్లాడుతూ…

“నిహారిక గారితో ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ చేసిన తరువాత మళ్లీ ఇప్పుడు ‘రాకాస’లో పని చేస్తున్నాను. మానస గారు నాకు మంచి పాత్ర రాశారు. అనుదీప్ మంచి సంగీతం అందించారు. ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది” అని చెప్పారు.

నటి రోహిణి మాట్లాడుతూ…

“‘రాకాస’ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే సినిమా. పిల్లలు, పెద్దలు అందరూ కలిసి చూడగలిగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. మంచి పాత్ర ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు” అని తెలిపారు.

మొత్తానికి, రాకాస టీజర్ లాంచ్ ఈవెంట్‌లో టీమ్ మొత్తం సినిమా మీద ఉన్న నమ్మకాన్ని స్పష్టంగా వ్యక్తం చేసింది. పౌరాణిక నేపథ్యం, వినోదాత్మక అంశాలు, భారీ నిర్మాణ విలువలతో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading