Download App

Peddi డబ్బింగ్ మొదలుపెట్టిన Ram Charan – వైరల్ అవుతున్న ‘ఏమది’ డైలాగ్!

మార్చి 2, 2026 By Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్ పెద్ది విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో సినిమాపై బజ్ నెక్స్ట్ లెవల్‌కు చేరుకుంది. Buchi Babu Sana దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ...
Peddi డబ్బింగ్ మొదలుపెట్టిన Ram Charan – వైరల్ అవుతున్న ‘ఏమది’ డైలాగ్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్ పెద్ది విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో సినిమాపై బజ్ నెక్స్ట్ లెవల్‌కు చేరుకుంది. Buchi Babu Sana దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. ఆస్కార్ అవార్డు గ్రహీత A. R. Rahman స్వరపరిచిన ఫస్ట్ షాట్ గ్లింప్స్, అలాగే బ్లాక్‌బస్టర్ ఫస్ట్ సింగిల్ ‘చికిరి చికిరి’కి అద్భుతమైన స్పందన లభించింది. ఈ పాట మ్యూజిక్ చార్ట్‌లలో ట్రెండ్ అవుతూ రికార్డులను బద్దలు కొట్టింది.

తాజాగా రామ్ చరణ్ పెద్ది చిత్రానికి డబ్బింగ్ ప్రారంభించారు. పెద్ది పాత్రలో ఆయన చెప్పిన ‘ఏమది’ డైలాగ్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

డబ్బింగ్ స్టూడియో నుంచి విడుదలైన వీడియోలో చరణ్ సరదాగా దర్శకుడు బుచ్చిబాబుతో మాట్లాడుతూ … “బుచ్చి.. ‘చికిరి’ పాటలో మోహిత్ చౌహాన్ వాయిస్‌కు నువ్వు ఎంత యాక్టింగ్ చేశావంటే, నువ్వే పాడావా? ఆయన పాడాడా? అనే డౌట్ వచ్చింది. నాకు డబ్బింగ్‌లో కూడా అలా యాక్టింగ్ చేయమని చెప్పకు. డబ్బింగ్ నేనే చెప్పానండి!” అని చమత్కరించారు.

‘పెద్ది’: రామ్ చరణ్ యాక్షన్ సన్నివేశాల కోసం భారీ స్థాయి సెటప్

ఈ సరదా సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షూటింగ్ దశలోనే సినిమా టీమ్ మధ్య ఉన్న కంఫర్ట్, కెమిస్ట్రీ ఈ వీడియో ద్వారా స్పష్టమవుతోంది.

ఇప్పటికే మ్యూజికల్ బజ్ సృష్టించిన ఈ చిత్రంలోని రెండో సింగిల్ ‘రై రై రారా’ మార్చి 2న విడుదల కానుంది. రెహమాన్ సంగీతం, చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ కలయిక మరోసారి మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకునేలా ఉంది.

ఈ చిత్రంలో Janhvi Kapoor కథానాయికగా నటిస్తుండగా, Shiva Rajkumar, Jagapathi Babu, Divyendu Sharma, Boman Irani కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

టెక్నికల్‌గా కూడా ఈ చిత్రం బలంగా నిలుస్తోంది. డీవోపీగా R. Rathnavelu, ఎడిటర్‌గా జాతీయ అవార్డు గ్రహీత Navin Nooli, ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా పనిచేస్తున్నారు. భారీ నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ చిత్రం విజువల్‌గా గ్రాండ్ అనుభూతిని అందించనుంది.

పెద్ది ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 30న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్లతో హీట్ పెంచిన ఈ సినిమా, విడుదల సమయానికి పాన్-ఇండియా స్థాయిలో భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading