Download App

ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్… కౌంట్‌డౌన్ స్టార్ట్!

అక్టోబర్ 19, 2025 By Srinivas
ప్రభాస్ అభిమానులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న క్షణం ఎట్టకేలకు రానుంది! పాన్-ఇండియా లెవెల్‌లో తెరకెక్కుతున్న ప్రభాస్ తాజా పీరియడ్ యాక్షన్ డ్రామా, వర్కింగ్ టైటిల్‌గా ఉన్న ‘ఫౌజీ’ ఫస్ట్ లుక్ రేపు (అక్టోబర్ 20) మధ్యాహ్నం 4:05 గంటలకు విడుదల కానుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని సినిమా నిర్మాణ...
ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్…

ప్రభాస్ అభిమానులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న క్షణం ఎట్టకేలకు రానుంది! పాన్-ఇండియా లెవెల్‌లో తెరకెక్కుతున్న ప్రభాస్ తాజా పీరియడ్ యాక్షన్ డ్రామా, వర్కింగ్ టైటిల్‌గా ఉన్న ‘ఫౌజీ’ ఫస్ట్ లుక్ రేపు (అక్టోబర్ 20) మధ్యాహ్నం 4:05 గంటలకు విడుదల కానుందని తెలుస్తోంది.

ఈ విషయాన్ని సినిమా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తమ అధికారిక ఎక్స్ (Twitter) హ్యాండిల్‌లో ప్రకటిస్తూ – “This Battle demands a BATTALION! #PrabhasHanu. Tomorrow. 4:05 PM” అని పోస్ట్ చేసింది.

ప్రస్తుతం టైటిల్‌పై అధికారిక ప్రకటన రానప్పటికీ, ‘ఫౌజీ’ అనే వర్కింగ్ టైటిల్ సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని సెన్సిబుల్ ఫిల్మ్‌మేకర్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన ప్రత్యేకమైన ఎమోషన్, విజువల్ ప్రెజెంటేషన్, మానవీయత మిళితమైన కథలతో సినిమాలు తెరకెక్కిస్తారనే పేరుంది. కాబట్టి ప్రభాస్‌తో ఆయన కలయికపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ చిత్రంతో సోషల్ మీడియా సెలబ్రిటీ ఇమాన్వీ భారతీయ సినీ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఆమె ఎంట్రీ కూడా ప్రాజెక్ట్‌కి అదనపు హైప్‌ను తెచ్చింది.

ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో ఇప్పటికే కౌంట్‌డౌన్ మొదలుపెట్టేశారు — “ఫౌజీ ఫస్ట్ లుక్ = బర్త్‌డే బ్లాస్ట్ స్టార్టర్!” అంటూ పోస్టులు షేర్ చేస్తున్నారు.

మొత్తానికి, ప్రభాస్ బర్త్‌డే వేడుకలకి ఇది స్టార్ట్ మాత్రమే… రాబోయే రోజుల్లో సాలిడ్ అప్‌డేట్స్, సర్ప్రైజ్ పోస్టర్స్, గ్లింప్స్, టైటిల్ రివీల్ వరుసగా వచ్చి అభిమానుల పండుగలా మారనున్నాయి.

Stay tuned… రేపు మధ్యాహ్నం 4:05కు ప్రభాస్ ‘ఫౌజీ’ ఫస్ట్ లుక్ గ్రాండ్ రివీల్

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading