Download App

‘హరి హర వీరమల్లు’ ట్రైలర్‌కు తేదీ ఫిక్స్!

జూన్ 28, 2025 By Rahul N
పవర్ స్టార్ ఫాన్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 'హరి హర వీరమల్లు' ట్రైలర్ తేదీ ఖరారైంది. భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిలవబోయే ఈ చిత్ర ట్రైలర్‌ను జూలై 3వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ...
'హరి హర వీరమల్లు' ట్రైలర్‌కు తేదీ ఫిక్స్!

పవర్ స్టార్ ఫాన్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ తేదీ ఖరారైంది. భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిలవబోయే ఈ చిత్ర ట్రైలర్‌ను జూలై 3వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో మునుపెన్నడూ చూడని శక్తివంతమైన చారిత్రక పాత్రలో కనిపించనున్నారు. మొఘల్ సామ్రాజ్యాన్ని ధిక్కరించిన ధీరుడి జీవన ప్రయాణాన్ని ఆవిష్కరించే ఈ కథలో పవన్ కళ్యాణ్ ‘వీరమల్లు’ గా ఓ విభిన్న అవతారాన్ని చూడబోతున్నాం.

క్రిష్ జాగర్లమూడి నుంచి ‘హరి హర వీరమల్లు’ చిత్ర దర్శకత్వ బాధ్యతలు అందుకుని దర్శకుడు ఎ.ఎం. జ్యోతి కృష్ణ.. చిత్రాన్ని పూర్తి చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రతి ఫ్రేమ్‌ గొప్పగా చూపించేలా చిత్ర బృందం కృషి చేస్తోంది.

ఈ చారిత్రక గ్రాండియస్ ప్రాజెక్ట్‌కు ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు — ‘మాట వినాలి’, ‘కొల్లగొట్టినాదిరో’, ‘అసుర హననం’, ‘తార తార’ — సంగీతప్రేమికుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి.

బాబీ డియోల్, నిధి అగర్వాల్ వంటి స్టార్‌ నటులతో పాటు పలు ముఖ్యమైన పాత్రల్లో అనేకమంది ప్రఖ్యాత నటులు నటిస్తున్నారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలు జ్ఞాన శేఖర్ వి.ఎస్., మనోజ్ పరమహంస నిర్వహించగా, ఎడిటింగ్ ప్రవీణ్ కె.ఎల్. చేపట్టారు. కళా దర్శకుడిగా తోట తరణి రూపొందించిన సెట్‌లు చారిత్రకతకు ప్రతిరూపంగా నిలుస్తున్నాయి.

ఎ.ఎం. రత్నం సమర్పణలో, మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 24, 2025న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

Trending Now

No trending articles in this category from the last 3 days.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading