బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో కామనర్ కంటెస్టెంట్ హరిత హరీష్ ప్రయాణం ముగిసింది. ఆదివారం ఎపిసోడ్‌లో హరీష్ ఎలిమినేట్ అవ్వడంతో హౌస్ నుంచి బయటకు వచ్చాడు. కానీ వెళ్తూ వెళ్తూ చేసిన మాస్క్ మ్యాన్ రివీల్ మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
హరీష్ ఎలిమినేషన్ అయ్యి స్టేజి పై ఉన్న సమయంలో.. హౌస్‌లో ఉన్న వారిలో ముసుగులో ఉన్నవారు ఎవరో, నిజంగా ముసుగు లేకుండా ఉండే వారు ఎవరో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. “ముసుగు వేసుకున్నవారిలో భరణి, ఇమ్మాన్యుయెల్, డీమాన్ పవన్” అని చెప్పగా, “ముసుగు లేకుండా లేకుండా నిజాయితీగా ఆడుతున్నవారిలో కళ్యాణ్, శ్రీజ, తనూజ” అని పేర్కొన్నాడు.
ఇప్పటికే తాను ఎలిమినేట్ అవుతానని అంచనా వేసిన హరీష్, ఈ వారం మొత్తం చాలా కూల్‌గా, ఎలాంటి ఎమోషనల్ రియాక్షన్ లేకుండా కనిపించాడు. “ఇంటికి వెళ్తున్నా” అనే సంతోషమే అతని ముఖంలో స్పష్టంగా కనిపించింది.
కామనర్‌గా బిగ్ బాస్ హౌస్‌లో అడుగు పెట్టిన హరీష్, “అగ్నిపరీక్ష” ద్వారా ఎంపికయ్యాడు. ఆ పరీక్షలో బిందు మాధవి, అభిజిత్ లతో తలపడి రెడ్ మార్క్ తెచ్చుకున్నాడు. బిందు అయితే ఆయన మెడలో “లూజర్” బోర్డ్ కూడా వేసింది. చివరికి బిందు మాధవే హరీష్‌ని హౌస్‌లోకి పంపిన వ్యక్తి కావడం విశేషం.
హరీష్ హౌస్‌లోకి వచ్చిన తర్వాత కూడా తాను ఎలా ఉన్నానో అలానే ఉండాలని భావించాడు. కానీ బిగ్ బాస్ హౌస్‌లో అడ్జస్ట్‌మెంట్‌లు చాలా అవసరం అని అర్థం చేసుకోలేకపోయాడు. రెండో వారం మూడు నుంచి నాలుగు రోజులు ఏమీ తినకుండా నిరాహార దీక్ష చేసినట్టు కనిపించాడు. నాలుగో వారం హెల్త్ ఇష్యూస్ కారణంగా టాస్క్‌కి దూరమయ్యాడు.
బిగ్ బాస్ ఇచ్చిన అవకాశాలను వాడుకోలేకపోయిన హరీష్ చివరకు హౌస్ నుంచి బయటకు వచ్చాడు. ఇప్పటివరకు కామనర్స్ నుంచి ఆరుగురు హౌస్‌లోకి వచ్చి ఉండగా, రెండో వారం మనీష్, మూడో వారం ప్రియా శెట్టి ఎలిమినేట్ కాగా, ఇప్పుడు హరీష్ కూడా బిగ్ బాస్ జర్నీ ముగించాడు.
ప్రస్తుతం హౌస్‌లో శ్రీజ, కళ్యాణ్, డీమాన్ పవన్ కొనసాగుతున్నారు. అలాగే మూడో వారం అగ్నిపరీక్ష ద్వారా వచ్చిన దివ్య కూడా హౌస్‌లో స్థానం సంపాదించింది.
బిగ్ బాస్ సీజన్ 9కి వచ్చే వారం దివాళి స్పెషల్ ఎపిసోడ్ గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఐదు వారాలు పూర్తవుతున్న నేపథ్యంలో బిగ్ బాస్ టీమ్ సీజన్ 9 – వెర్షన్ 2.O మొదలుపెట్టేందుకు సిద్ధమవుతోంది. అదే సమయంలో కొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా హౌస్‌లోకి అడుగుపెట్టనున్నాయని టాక్.