సినిమా వార్తలు

Kantara Chapter 1 Weekend: కాంతారా చాప్టర్ 1 బాక్సాఫీస్ కలెక్షన్స్

Published by
Srinivas

రిషబ్ శెట్టి (Rishab Shetty) నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతారా చాప్టర్ 1’(Kantara Chapter 1) దేశవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. జయరామ్ కీలక పాత్రలో కనిపించగా, రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా అందరిని ఆకట్టుకుంది. రెండో రోజు కలెక్షన్లు కొంత తగ్గినా, తెలుగు స్టేట్స్ లో ఈ చిత్రం డబ్బింగ్ సినిమాగా రికార్డు స్థాయి ఓపెనింగ్ సాధించింది.

తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా రూ.50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ రాబట్టింది. ఇది ఏ డబ్బింగ్ సినిమాకు దక్కని ఘనతగా నిలిచింది. తొలి భాగం సృష్టించిన క్రేజ్, ప్రేక్షకుల్లో ఏర్పడిన ఆధ్యాత్మిక అనుభూతి – ఈ రెండింటి కలయిక “చాప్టర్ 1”కి బాక్సాఫీస్ వద్ద మజిలీ చూపించాయి.

‘కాంతారా చాప్టర్ 1’ను ప్రేక్షకులు సాధారణ యాక్షన్ డ్రామాగా కాకుండా, భక్తి – ఆధ్యాత్మిక నేపథ్యమున్న చిత్రంగా భావించారు. ఈ భావోద్వేగ అనుబంధమే సినిమాకు సూపర్ బూస్ట్ ఇచ్చింది. శనివారం, ఆదివారాల్లో కలెక్షన్లు ఊపందుకోవడంతో ఫోర్ డేస్ వీకెండ్ గ్రాస్ భారీగా పెరిగింది.

కన్నడ వెర్షన్ కర్ణాటక బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నెలకొల్పింది. వారం చివర్లో కలెక్షన్లు “కేజీఎఫ్ 2” స్థాయికి చేరి, దాదాపు దానిని సాటి చేసినట్లు ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి.

హిందీ వెర్షన్ కూడా దేశవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ పొందింది. ఇప్పటివరకు హిందీ బెల్ట్‌లోనే ఈ సినిమా రూ.70 కోట్లు (నెట్) వసూలు చేసింది.

మొత్తం ఇండియా కలెక్షన్లు కలిపి ఇప్పటికే రూ.250 కోట్లు గ్రాస్ దాటగా, ప్రపంచవ్యాప్తంగా సినిమా రూ.310 కోట్లు గ్రాస్ వసూలు చేసింది — అది కూడా కేవలం నాలుగు రోజుల్లో!

ఈ ట్రెండ్ చూస్తుంటే, “కాంతారా చాప్టర్ 1” రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ముఖ్యంగా కన్నడ, హిందీ మార్కెట్లలో ఈ చిత్రం దీర్ఘకాల రన్ అందుకునే అవకాశం ఉంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.