Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ ట్విట్టర్ రివ్యూ
జనవరి 14, 2026 Published by Srinivas

సంక్రాంతి బాక్సాఫీస్ రేసులో మరో ఆసక్తికరమైన సినిమాగా Anaganaga Oka Raju ఈ రోజు థియేటర్లలోకి వచ్చింది. Naveen Polishetty, Meenakshi Chaudhary ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి Maari దర్శకత్వం వహించగా, Suryadevara Naga Vamsi నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ఉదయం షోల నుంచే ప్రేక్షకుల నుంచి సినిమాకు మంచి స్పందన వస్తోంది.
ప్రత్యేకంగా సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులు తమ తొలి అభిప్రాయాలను పంచుకుంటున్నారు. చాలా కాలం తర్వాత నవీన్ పోలిశెట్టి క్లిన్, టైమింగ్‌తో కూడిన కామెడీతో తిరిగి వచ్చాడని నెటిజన్లు కొనియాడుతున్నారు. అతడి కామిక్ టైమింగ్ మళ్లీ పాత ఫామ్‌లోకి వచ్చిందని, డైలాగ్ డెలివరీ సహజంగా ఉండడంతో నవ్వులు నిరంతరంగా పేలుతున్నాయని ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి.
నెటిజన్ల మాటల్లో చెప్పాలంటే, సినిమాలో హ్యూమర్ ఎక్కడా బ్రేక్ కాకుండా ప్రవహిస్తుందట. సన్నివేశాల మధ్య గ్యాప్ లేకుండా గ్యాగ్స్ సరిగ్గా వర్క్ అవుతుండటంతో ఎంటర్‌టైన్‌మెంట్ విలువ పూర్తిగా నిలబడిందని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో నవ్వుల జాతర కొనసాగుతుందని, ఫ్యామిలీ ఆడియన్స్‌కు సినిమా బాగా కనెక్ట్ అవుతుందని పలువురు పేర్కొన్నారు.
ఇక కథానాయికగా మీనాాక్షి చౌదరి పాత్ర కూడా సరైన స్థాయిలో ఉందని, నవీన్‌తో ఆమె కెమిస్ట్రీ సినిమాకు అదనపు ప్లస్‌గా మారిందని కొంతమంది ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. దర్శకుడు మారి కథను లైట్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా నడిపించడంలో సక్సెస్ అయ్యాడని ట్విట్టర్ రివ్యూలు చెప్తున్నాయి.
