
రెబల్ స్టార్ Prabhas కెరీర్‌లోనే అత్యంత ఇంటెన్స్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం Spirit. హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్‌లను అందించిన దర్శకుడు Sandeep Reddy Vanga దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. న్యూ ఇయర్ సందర్భంగా విడుదలైన పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్‌లో ప్రభాస్‌ను రా, ఫిల్టర్ చేయని అవతార్‌లో చూపించగా, ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇప్పటికే షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి మేకర్స్ అధికారికంగా థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను లాక్ చేశారు. వచ్చే ఏడాది సమ్మర్ రేస్‌కు కిక్‌స్టార్ట్ ఇస్తూ ‘స్పిరిట్’ మార్చి 5, 2027న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. మహాశివరాత్రి పండుగకు ముందు రోజు కావడం విశేషం. ఇక విడుదల వారంలోనే ఈద్ కూడా రావడంతో, సినిమాకు డబుల్ హాలిడే అడ్వాంటేజ్ దక్కనుంది. సాధారణంగా సంక్రాంతి సీజన్‌లో భారీ పోటీ ఉండటాన్ని దృష్టిలో పెట్టుకుని, మేకర్స్ సోలో రిలీజ్ విండోను ఎంచుకోవడం ట్రేడ్ వర్గాల్లో ప్రశంసలు అందుకుంటోంది.
సందీప్ రెడ్డి వంగా మార్క్ రా ఇంటెన్సిటీ, యాక్షన్, భావోద్వేగాలు, పవర్‌ఫుల్ న్యారేషన్‌తో ఈ యాక్షనర్ ఓ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించనుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కథానాయికగా Triptii Dimri నటిస్తుండగా, కీలక పాత్రలో Prakash Raj కనిపించనున్నారు.
ఈ భారీ ప్రాజెక్ట్‌ను Bhadrakali Pictures మరియు T-Series Films సంయుక్తంగా భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. పాన్-ఇండియా స్థాయిని మించి యూనివర్సల్ అప్పీల్‌తో రూపొందుతున్న ‘స్పిరిట్’ను తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలతో పాటు చైనీస్, జపనీస్, కొరియన్—మొత్తం 8 భాషల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
మొత్తంగా, ప్రభాస్–సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్, రా యాక్షన్, గ్లోబల్ రిలీజ్ ప్లాన్‌తో ‘స్పిరిట్’ 2027లో బాక్సాఫీస్‌ను షేక్ చేసే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఒకటిగా నిలవనుందన్నది స్పష్టం.
