సినిమా వార్తలు

డ్యూడ్ లో ఆ సీన్స్ కోసం కోసం రాత్రంతా ప్రాక్టీస్‌ చేసా – మమిత బైజు

Published by
Srinivas

‘ప్రేమలు’ విజయానంతరం ప్రదీప్ రంగనాథన్‌ సరసన ఈ చిత్రంలో హీరోయిన్‌గా మమిత బైజు కనిపించనున్నారు. శరత్‌కుమార్ కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను సృష్టించాయి. అక్టోబర్ 17న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది.

హీరోయిన్ మమిత బైజు ఇటీవల జర్నలిస్టులతో మాట్లాడుతూ సినిమా విశేషాలను పంచుకున్నారు.

కథ వినగానే ఆకట్టుకుంది:

“‘ప్రేమలు’ రిలీజ్‌ తర్వాతే మేకర్స్ నన్ను సంప్రదించారు. డైరెక్టర్ కీర్తిశ్వరన్ తొలిసారిగా కథ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది. ఆ కథలోని కాన్సెప్ట్‌ కొత్తదిగా, ఆకర్షణీయంగా అనిపించింది,” అని ఆమె తెలిపారు.

‘కురల్’ పాత్ర నాకు ప్రత్యేకం:

“నా పాత్ర కురల్‌ చాలా హానెస్ట్ క్యారెక్టర్‌. ఆమె తన భావోద్వేగాలకు నిజాయితీగా ఉంటుంది, చుట్టూ ఉన్న వారితో చాలా స్నేహంగా ఉంటుంది. ఈ పాత్రను చేయడం నాకు కొత్త అనుభవం. ఇందులోని ఎమోషనల్ సీన్లు చాలా సవాలుగా అనిపించాయి. వాటి కోసం రాత్రంతా డైలాగ్స్ ప్రాక్టీస్‌ చేసాను,” అని మమిత అన్నారు.

ప్రదీప్‌తో కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది:

“ప్రదీప్ రంగనాథన్‌తో పని చేయడం అద్భుతం. ఆయన సెట్‌లో చాలా సింపుల్‌గా, ఫన్‌గా ఉంటారు. ఎంత సక్సెస్‌ వచ్చినా ఆయనలో ఎగో లేదు. సహజంగా నటించడం ఆయనకు అలవాటు. మా పాత్రల కెమిస్ట్రీ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది,” అని ఆమె పేర్కొన్నారు.

కీర్తిశ్వరన్‌ క్లారిటీ ఉన్న దర్శకుడు:

“కీర్తిశ్వరన్ సర్ చాలా క్లియర్‌ విజన్‌తో సినిమా తీశారు. ఆయన గైడెన్స్ వల్ల నా పాత్రను లోతుగా అర్థం చేసుకుని సహజంగా నటించగలిగాను. ఆయనతో పని చేయడం గొప్ప అనుభవం,” అని మమిత తెలిపారు.

మ్యూజిక్, విజువల్స్ సినిమాకి బలమైన పాయింట్లు:

“సాయి అభ్యంకర్ సంగీతం సినిమాకి పెద్ద బలంగా మారింది. ప్రతి పాట హృదయాన్ని తాకుతుంది. నేపథ్య సంగీతం కూడా సినిమాకి లైఫ్ ఇచ్చింది. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ అద్భుతం – ప్రతి ఫ్రేమ్ అందంగా తీర్చిదిద్దారు,” అని ఆమె ప్రశంసించారు.

మైత్రి మూవీ మేకర్స్‌పై ప్రశంసలు:

“మైత్రి మూవీ మేకర్స్‌తో పని చేయడం గొప్ప అనుభవం. వాళ్లు చాలా పాషనేట్ ప్రొడ్యూసర్స్. సినిమాను గ్రాండ్‌గా తీశారు,” అని అన్నారు.

దీపావళి కోసం పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్:

“‘డ్యూడ్’ అన్ని వయసుల ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది. ఇది ఫన్‌గా, లైట్‌హార్ట్‌డ్‌గా ఉన్నా, లోపల ఒక మీనింగ్‌ఫుల్ మెసేజ్ ఉంది. దీపావళి పండుగకు సరైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది,” అని మమిత బైజు చెప్పారు.

చివరిగా ఆమె…. “నా అభిమానులు, తెలుగు మరియు తమిళ ప్రేక్షకులందరూ ‘డ్యూడ్’ సినిమాకి ప్రేమ చూపిస్తారని ఆశిస్తున్నాను. ఈ సినిమాను ఎంతో మనసు పెట్టి తీసాం. కుటుంబంతో, స్నేహితులతో కలిసి థియేటర్‌కి వెళ్లి ‘డ్యూడ్’ను ఎంజాయ్ చేయండి. ఈ దీపావళిని ఆనందంగా జరుపుకోండి!” అని అన్నారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.