సినిమా వార్తలు

OTT Comedy Movie: ఓటీటీలోకి తరుణ్ భాస్కర్ మూవీ… ENE2 కాదు, ఆహాలో సర్ప్రైజ్

Published by
Srinivas

Crazy Kalyanam OTT: తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ENE Repeat థియేటర్లలో విడుదలైన రోజే… ఆయన ఓ ప్రధాన పాత్రలో నటించిన క్రేజీ కళ్యాణం ఓటీటీలోకి వచ్చింది.

Tharun Bhascker Crazy Kalyanam OTT Streaming: తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ‘ఈ నగరానికి ఏమైంది 2’ థియేటర్లలోకి వచ్చిన రోజే… ఆయన ప్రధాన పాత్రలో నటించిన ఓ సినిమాను ఓటీటీలోకి తీసుకు వచ్చింది ఆహా. ప్రస్తుతానికి గోల్డ్ సబ్క్రిప్షన్ ఉన్న వాళ్ళకు సినిమాను అందుబాటులోకి తెచ్చింది. ఒక్క రోజు వ్యవధిలో సబ్స్రైబర్లు అందరికీ అందుబాటులోకి తెస్తుంది.

ఆహాలో క్రేజీ కళ్యాణం స్ట్రీమింగ్!

Crazy Kalyanam Streaming Now On Aha: అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘క్రేజీ కళ్యాణం’. ఆమెకు జంటగా ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఫేమ్ అఖిల్ రాజ్ హీరోగా నటించారు. ఇందులో తరుణ్ భాస్కర్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాను ఆహా ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తుంది.

తెలుగుతో పాటు తమిళ భాషల్లో ‘క్రేజీ కళ్యాణం’ను వీక్షకులకు అందుబాటులోకి తీసుకొచ్చింది ఆహా ఓటీటీ. నవంబర్ 19న గోల్డ్ సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్లకు, నవంబర్ 20 నుంచి సబ్క్రైబర్లు అందిరికీ అందుబాటులోకి రానుంది.

క్రేజీ కళ్యాణం సినిమాకు భద్రప్ప గాజుల దర్శకత్వం వహించారు. సీనియర్ నరేష్, కిరీటి దామరాజు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. థియేటర్లలో ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ కలెక్షన్లు రాలేదు. ఓటీటీలో అయినా హిట్ టాక్ వస్తుందో లేదో చూడాలి.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts

  • సినిమా వార్తలు

హీరోయిన్లతో రూమర్స్… భయపడిన నాగవంశీ?

నవంబర్ 17, 2026