సినిమా వార్తలు

జాన్వి కపూర్ ‘అచ్చియమ్మ’ లుక్‌ – రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి రెండు పోస్టర్స్ విడుదల!

Published by
Rahul N

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా రూరల్ యాక్షన్ డ్రామా “పెద్ది” చిత్ర షూటింగ్ వేగంగా సాగుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌కు బుచ్చి బాబు సన దర్శకత్వం వహిస్తుండగా, హీరోయిన్‌గా జాన్వి కపూర్ నటిస్తోంది.

ఇప్పుడు, చిత్ర బృందం హీరోయిన్ జాన్వి కపూర్ పాత్రను పరిచయం చేస్తూ “అచ్చియమ్మ”గా రెండు ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేసింది.

మొదటి పోస్టర్‌లో జాన్వి కపూర్ గ్రామీణ చీరలో, సాంప్రదాయ ఆభరణాలతో, సన్‌గ్లాసెస్‌తో మైక్ ముందు ఆత్మవిశ్వాసంగా నిలబడి కనిపిస్తోంది. ఈ లుక్‌లో ఆమె పూర్తి స్థాయి గ్రామీణ ఫెస్టివ్ ఫీల్ ఇచ్చింది.

రెండవ పోస్టర్‌లో నీలి చీరలో జాన్వి జీప్‌పై నిలబడి, జనాలకు అభివాదం చేస్తూ కనిపిస్తోంది. ఈ లుక్‌లో ఆమె పాత్రలోని ధైర్యం, దూకుడు, ప్రజాదరణను ప్రతిబింబిస్తుంది. మేకర్స్ ఆమె పాత్రను “ఫియర్‌లెస్ అండ్ ఫియర్స్”గా వర్ణించారు. రెండు పోస్టర్లలోనూ జాన్వి పూర్తి మాస్ వైబ్స్‌తో ఆకట్టుకుంది.

ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మా, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

సాంకేతిక విభాగంలో కూడా “పెద్ది” సినిమాకు అద్భుతమైన టీమ్ పనిచేస్తోంది. సంగీతం అందిస్తున్నది ఆస్కార్ అవార్డు విజేత ఏ.ఆర్. రెహ్మాన్, సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేస్తున్నది ఆర్. రత్నవేలు, ఎడిటింగ్ బాధ్యతలు నేషనల్ అవార్డు విన్నర్ నవీన్ నూలి చేపట్టారు. ఈ ముగ్గురు టెక్నీషియన్స్ కలయిక సినిమాకు ప్రపంచ స్థాయి నాణ్యతను అందించబోతోందని మేకర్స్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

వృద్దీ సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ప్రతిష్టాత్మకంగా సమర్పిస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్, వర్కింగ్ స్టిల్స్ ద్వారా ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ చేసింది.

భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న “పెద్ది” చిత్రం 2026 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ పాన్ ఇండియా రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

Rahul N