సినిమా వార్తలు

ఆస్తి కోసం కోర్టుకెక్కిన కరిష్మా కపూర్ పిల్లలు

Published by
Srinivas

ప్రముఖ బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్ ఇద్దరు పిల్లలు, తమ తండ్రి ఆస్తిలో వాటా కోరుతూ కోర్టును ఆశ్రయించారు. సుమారు రూ. 30 వేలు కోట్లు విలువైన ఆస్తిపై హక్కులు కోరుతూ వారు దాఖలు చేసిన పిటీషన్ బుధవారం విచారణకు రానుంది.

కరిష్మా 2003లో సంజయ్ కపూర్‌ను వివాహం చేసుకున్నారు. 2016లో విడాకులు తీసుకున్నారు. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. సంజయ్ కపూర్ ఈ ఏడాది జూన్‌లో లండన్‌లో పోలో ఆడుతున్న సమయంలో గుండెపోటుతో మరణించారు.

పిల్లలు తమ కోర్టు పిటిషన్‌లో తండ్రి వ్రాసినట్టు చెబుతున్న వీలునామా (will) పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ వీలునామా ప్రకారం మొత్తం ఆస్తి వారి సవతి తల్లి ప్రియ కపూర్‌కు చెందుతుందని చెబుతుండటంపై వారు ప్రశ్నించారు. ఈ విల్ అసలైనది కాదని, నకిలీ పత్రాన్ని సృష్టించారని ఆరోపించారు.

పిటీషనర్ల అభిప్రాయం ప్రకారం నిజమైన వీలునామా ఉంటే దాని ప్రతిని వారికి అందించేవారని, కానీ ఎప్పుడూ తమకు ఇవ్వలేదని వాదించారు. తండ్రి మరణ సమయానికి ఆయనకున్న అన్ని ఆస్తుల వివరాలు తమకు తెలియనందున, ఆ సమాచారం అందించాలని కూడా కోర్టులో కోరారు.

ఇకపోతే, సంజయ్ కపూర్ మరణంపై కూడా వివాదం చెలరేగింది. ఆయన తల్లి రాణి కపూర్, తన కుమారుడు సహజ మరణం చెందలేదని, హత్యకు గురయ్యారని ఇటీవల బ్రిటన్ అధికారులకు లేఖ రాసారు. తన కుమారుడి మరణం వెనుక కుట్ర, ఆర్థిక మోసం దాగి ఉన్నాయని, దానిపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆమె డిమాండ్ చేశారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts