కిరణ్ అబ్బవరం ‘K-Ramp’ ట్విట్టర్ రివ్యూ..
October 18, 2025 Published by Srinivas

యువ హీరో కిరణ్ అబ్బవరం తాజా చిత్రం ‘కే-రాంప్’ ఈ రోజు థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదలైంది. హీరోయిన్‌గా యుక్తి థరేజా నటించిన ఈ చిత్రానికి జైన్స్ నాని దర్శకత్వం వహించగా, చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.
ఈ సినిమాను రజేష్ డండా, శివ బొమ్మక కలిసి హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌లపై నిర్మించారు.
రిలీజ్‌కు ముందే వచ్చిన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. సోషల్ మీడియాలో ఇప్పటికే సినిమా చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు.
కొంతమంది నెటిజన్లు కిరణ్ అబ్బవరం ఎనర్జీని, చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని ప్రశంసిస్తుండగా, మరికొందరు కథ పై మిశ్రమ స్పందనలు వ్యక్తం చేస్తున్నారు.
