
పుష్ప తర్వాత తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన ఫహద్ ఫాజిల్, కమెడియన్ వడివేలు జోడీగా కనిపించిన డ్రామా–థ్రిల్లర్ మారీసన్ (Maareesan) గత నెల జూలై 25, 2025న థియేటర్లలో విడుదలైంది. విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ సాధించలేకపోయింది.
ఇప్పుడు ఈ సినిమా ఓటిటిలో(OTT)కి వచ్చేసింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆస్వాదించవచ్చు. థియేటర్లలో నాలుగు వారాలు ప్రదర్శితమైన తరువాత, ఓటీటీలోకి వచ్చింది. ప్రముఖ నటీనటులు, థ్రిల్లింగ్ జానర్ కారణంగా నెట్‌ఫ్లిక్స్‌లో మంచి వ్యూయర్‌షిప్ సాధించే అవకాశం ఉందని అంచనా.
ఈ చిత్రంలో కోవై సరళ, వివేక్ ప్రసన్న, సితార, రేణుక తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఆర్.బి. చౌదరి తన సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్‌లో నిర్మించగా, యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. ఆయన బాణీలు చిత్రానికి భావోద్వేగాన్ని, సస్పెన్స్‌ను మరింతగా పెంచాయి.
