Download App

‘మాస్ జాతర’ ట్రైలర్: మాస్ మహారాజా రవితేజ నుంచి పక్కా మాస్ విందు

అక్టోబర్ 28, 2025 By Srinivas
మాస్ మహారాజా రవితేజ అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘మాస్ జతర’ ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. రవితేజ నుండి అభిమానులు ఆశించే అసలైన మాస్ ఎనర్జీ, ఎంటర్టైన్‌మెంట్, యాక్షన్ అన్నీ ఈ ట్రైలర్‌లో ఒక్కటై వచ్చాయి. రైల్వే పోలీస్ ఆఫీసర్ పాత్రలో రవితేజ తనదైన స్టైల్‌లో కనిపించారు....
మాస్ జతర’ ట్రైలర్: మాస్ మహారాజా రవితేజ నుంచి పక్కా మాస్ విందు

మాస్ మహారాజా రవితేజ అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘మాస్ జతర’ ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. రవితేజ నుండి అభిమానులు ఆశించే అసలైన మాస్ ఎనర్జీ, ఎంటర్టైన్‌మెంట్, యాక్షన్ అన్నీ ఈ ట్రైలర్‌లో ఒక్కటై వచ్చాయి.

రైల్వే పోలీస్ ఆఫీసర్ పాత్రలో రవితేజ తనదైన స్టైల్‌లో కనిపించారు. ఆయన డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్, ఎనర్జీ ప్రేక్షకులను పూర్తిగా కట్టిపడేశాయి. ప్రతి ఫ్రేమ్‌లోనూ రవితేజ వింటేజ్ మాస్ వైబ్ స్పష్టంగా కనిపించింది.

భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, పంచ్ డైలాగ్‌లు, ఎమోషన్‌తో మిళితమైన సన్నివేశాలు మాస్ జతర ట్రైలర్‌ని అభిమానులకు పండుగగా మార్చాయి. కథానాయకుడు రవితేజ, ప్రతినాయకుడు నవీన్ చంద్ర మధ్య జరిగే ఘర్షణ సన్నివేశాలు చాలా ఇంటెన్స్‌గా ఉన్నాయి.

'మాస్ జాతర’ ట్రైలర్: మాస్ మహారాజా రవితేజ నుంచి పక్కా మాస్ విందు

కథానాయిక శ్రీలీల తెరపై తన సొగసుతో పాటు నటనతో మెప్పించింది. ముఖ్యంగా ఆమె తొలిసారి మాట్లాడిన శ్రీకాకుళం యాస ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చింది. రవితేజ–శ్రీలీల జంట కెమిస్ట్రీ ఈ ట్రైలర్‌లో స్పెషల్ ఆకర్షణగా నిలిచింది.

సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో మరోసారి తన మ్యూజిక్ మేజిక్ చూపించారు. ఆయన అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు బలం చేకూర్చి, రవితేజ మాస్ ఆరాను మరింత పెంచింది. పాటలు ఇప్పటికే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాయి.

రచయితగా అనేక హిట్ సినిమాలు అందించిన భాను భోగవరపు, ఈసారి దర్శకుడిగా మాస్ జతరతో రంగప్రవేశం చేస్తున్నారు. ఆయన స్టోరీ ట్రీట్‌మెంట్, ప్రెజెంటేషన్ కొత్త ఫీల్‌ను తెచ్చాయి.

ఈ భారీ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా, సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading